RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

సిద్ధాంతం కోసం పోరు.. పదవి కోసం నిరీక్షణ!

ఆళ్లగడ్డ, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య రాజకీయ ప్రస్థానం ఒక సామాన్యుడి ఆత్మగౌరవ పోరాటంగా సాగుతోంది. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేసి, ఉన్నతమైన ప్రైవేట్ ఉద్యోగాన్ని వదిలి, కేవలం పవన్ కల్యాణ్ ఆశయాలపై మక్కువతో 2014 నుండి ఆయన పార్టీ జెండాను భుజానకెత్తుకున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలయమైన ఆళ్లగడ్డలో సామాన్యుడి గొంతుక వినిపించాలనే లక్ష్యంతో, అనేక దాడులను భరించి, ప్రాణాపాయ స్థితి నుండి కోలుకుని కూడా…

అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 8 (డిగ్నిటీ న్యూస్): అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భూతం అరుణకుమారి మాట్లాడుతూ ఎవరు ఎంత సంపాదించిన తినేది అన్నమే తింటాం కాబట్టి మనకున్న దాంట్లో ఎంతో కొంత పేదలకు సహాయం చేయాలనీ కోరుతూ క్లాక్ టవర్ సెంటర్ లో పాక నమస్వి పుట్టిన రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాం అన్నారు . చారిటబుల్ ట్రస్ట్…

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మజ్జిగ పంపిణీ

నల్లగొండ, ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 8 (డిగ్నిటీ న్యూస్): వాసవి క్లబ్ కేసి జిఎఫ్ నల్గొండ ప్రెసిడెంట్ మిట్టపల్లి వాత్సవ్ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోగులకు పండ్లు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో యాచకులకు పేదలకు అన్నదాన వితరణ చేశారు. తదుపరి చెరువుగట్టులోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ సతీష్, ఐ ఈ సి…

మంత్రి సునీల్ ప్రథమ వర్ధంతి నివాళి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 8 (డిగ్నిటీ న్యూస్): దివంగత బ్రాహ్మణ సంఘం నాయకుడు, శ్రీ వైష్ణవి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మంత్రి సునీల్ ప్రథమ వర్ధంతి సంతాప సభ రానా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానాల శ్యాంసుందర్ రావు, ఉపాధ్యక్షులు దేవులపల్లి రంగా రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరి…

గానుగ కేంద్రాలలో నాణ్యమైన ముడి పదార్థం ఉపయోగించాలి

ప్రాంగణాన్ని పరిశుభ్రంగా శుభ్రతతో నిర్వహించాలి ముడి పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయాలి ప్రజలు లూజ్ ఆయిల్ కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలి నల్లగొండ ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . మే 8 .(డిగ్నిటీ న్యూస్): నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివ శంకర్ రెడ్డి దేవరకొండ బస్టాండ్ ప్రాంగణంలోని శివ గంగా ట్రేడర్స్, తిరునాల రోటరీ ఆయిల్ మిల్ , నందిని సంస్థలను తనిఖీ చేశారు.తనిఖీల సందర్భంగా…

రికవరీ చేసిన 75 సెల్ ఫోన్ల అందజేత

భువనగిరి, మే 8 (డిగ్నిటి న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 75 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి శుక్రవారం బాధితులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సుమారు రూ. 12 లక్షల విలువైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లను…

జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

నల్గొండ, మే (డిగ్నిటి న్యూస్): దేశ ప్రణాళికా రచన, భవిష్యత్తు అభివృద్ధిలో కీలకమైన 2027 జనగణన ప్రక్రియలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండలో మున్సిపల్ కార్పొరేషన్, ప్రణాళికా విభాగం సంయుక్తంగా నిర్వహించిన ‘జనగణన నడక’ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లాక్ టవర్ వద్ద జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే స్వీయ…

కూరగాయల మార్కెట్‌లో మున్సిపల్ కమిషనర్ తనిఖీ

​నంద్యాల, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్ కమిషనర్ శేషన్న శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు ​మార్కెట్ పరిసరాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించిన కమిషనర్, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. ​ముఖ్యంగా వ్యాపారులు తమ దుకాణాల వద్ద అక్రమంగా రోడ్లపైకి…

నడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య

ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య కత్తితో 17 చోట్ల పొడిచి హతమార్చిన యువతి బంధువులు జవహర్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ నాలుగేళ్లుగా సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్న యావన్(23) అనే బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న యువకుడు ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా, సీతాఫల్‌మండి ప్రాంతంలో ఉండే తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ తరచూ యువతిని కలుస్తున్న యావన్ దీంతో నిన్న రాత్రి మూడు ద్విచక్ర…

నంద్యాలలో పేదల కోసం మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేసిన గోళ్ళ రాజేష్

నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): మానవ సేవే మాధవ సేవగా భావించి సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్న గోళ్ల రాజేష్ మరో అడుగు ముందుకు వేశారు. పట్టణంలో గత ఏడాది కాలంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన, నిరుపేదల ఆకలి తీర్చేందుకు తాజాగా నూతన మొబైల్ క్యాంటీన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు రిపోర్టర్ నూర్ బాషా లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నూర్ బాషా మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలలుగా…

Exit mobile version