RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

నంద్యాలలో పేదల కోసం మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేసిన గోళ్ళ రాజేష్

నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): మానవ సేవే మాధవ సేవగా భావించి సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్న గోళ్ల రాజేష్ మరో అడుగు ముందుకు వేశారు.

పట్టణంలో గత ఏడాది కాలంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన, నిరుపేదల ఆకలి తీర్చేందుకు తాజాగా నూతన మొబైల్ క్యాంటీన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు రిపోర్టర్ నూర్ బాషా లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నూర్ బాషా మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలలుగా రూపాయికే భోజనం పథకం ద్వారా వేలాది మందికి ఆకలి తీరుస్తున్న గోళ్ల రాజేష్, ఇప్పుడు మొబైల్ క్యాంటీన్ ద్వారా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న ప్రజలకు మరింత చేరువకానున్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైద్య, ఆర్థిక సాయంతో పాటు నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా ఉపయోగకర పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడిస్తూ, ప్రజలందరూ రాజేష్‌ను ఆశీర్వదించాలని కోరారు. తక్కువ ధరకే రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న ఈ మొబైల్ క్యాంటీన్ సేవలను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version