శ్రీశైలం, మే 10: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం, వసతి, ఆర్జిత సేవల టికెట్ల కోసం భక్తులు కేవలం అధికారిక వెబ్‌సైట్లనే ఆశ్రయించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు. భక్తులకు పౌర సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా కూడా శ్రీశైల క్షేత్రానికి సంబంధించిన టికెట్లు పొందే వెసులుబాటు ఉందని ఆయన వివరించారు.ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా స్వామివారి…
ఆత్మకూరులో పోలీసుల తనిఖీలు
ఆత్మకూరు, మే 10 (డిగ్నిటి న్యూస్): ఆత్మకూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది పలు కాలనీల్లో ముమ్మరంగా సోదాలు చేపట్టారు. ప్రజల భద్రతే ధ్యేయంగా చేపట్టిన ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులు, రౌడీషీటర్ల నివాసాలను సోదా చేయడంతో పాటు…
వక్ఫ్ భూముల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల, మే 10 (డిగ్నిటి న్యూస్): కర్నూలు పట్టణంలోని వివాదాస్పద ఈద్గా స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. సుమారు 300 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడం ముస్లిం మైనార్టీల విజయమని ఆయన అన్నారు. ఆదివారం నంద్యాలలోని మంత్రి నివాసంలో జమాతే అహలే సున్నత్ ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,…
కేదారేశ్వరి అన్నదాన సత్రం గదుల పోస్టర్ ఆవిష్కరణ
నంద్యాల, మే 10 (డిగ్నిటి న్యూస్): పట్టణంలోని శ్రీ కేదారేశ్వరి దేవి సమేత శ్రీ ప్రమధనందీశ్వర స్వామి దేవస్థాన అనుబంధ నూతన అన్నదాన సత్రం గదుల ప్రారంభోత్సవ పోస్టర్‌ను రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఈ గదులను ఈ నెల 15న ఉదయం 8:30 గంటలకు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మెరుగైన వసతుల కల్పనలో దాతల సహకారం…
పదో తరగతి టాపర్‌కు ఎంపీ శబరి సన్మానం
ముచ్చుమర్రి (పగిడ్యాల), మే 10 (డిగ్నిటి న్యూస్): పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన విద్యార్థి షేక్ ముర్తుజావలిని నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన గౌండ మా భాష కుమారుడైన ముర్తుజావలి, ఇటీవల విడుదలైన ఫలితాల్లో 596 మార్కులు సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా విద్యార్థి నివాసానికి వెళ్లిన ఎంపీ,…
జనగణనలో ఎన్యూమరేటర్లకు సహకరించాలి: కమిషనర్
కర్నూలు, మే 10 (డిగ్నిటి న్యూస్): నగర పరిధిలో చేపడుతున్న తొలి విడత ఇంటిగణనలో భాగంగా ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు పూర్తిస్థాయిలో సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. ఆదివారం ఆయన కింగ్ మార్కెట్, ఖండేరి వీధి ప్రాంతాల్లో జరుగుతున్న గణన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలే ప్రాధాన్యత వహిస్తాయని…
దళితుల ఆత్మీయ బంధువు సీఎం రేవంత్ రెడ్డి
డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 10 (డిగ్నిటీ న్యూస్): దళితుల ఆత్మీయ బంధువు సీఎం రేవంత్ రెడ్డి అని డిసిసి అధ్యక్షులు పున్న కైలాస నేత వెల్లడించారు.ఆదివారం నల్గొండ పట్టణంలోని యాదవ సంఘ భవనంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణకై సమీక్ష సమావేశం నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా ఎస్ .సి.సెల్ సంస్థాగత నిర్మాణ…
ప్రతిష్ఠా మహోత్సవానికి రూ. 10 వేల విరాళం
బేడా బుడగజంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు బండి ఆత్మకూరు, మే 10 (డిగ్నిటి న్యూస్): మండలంలోని వెంగళరెడ్డి పేట గ్రామంలో ఈనెల 11న నిర్వహించనున్న గణపతి, రాములమ్మ, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవానికి బేడా బుడగజంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు రూ. 10 వేల విరాళం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ నాయకుడు తోట శివయ్య ఆహ్వానం మేరకు ఆయన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుగ్గరాముడు మాట్లాడుతూ.. స్థానిక…
నంద్యాల లో జిల్లా స్థాయి చదరంగ పోటీలు ప్రారంభం
నంద్యాల, మే 10 (డిగ్నిటి న్యూస్): స్థానిక టెక్కెలోని నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి ఓపెన్ అండ్ ఉమెన్ చెస్ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించారు. జిల్లా చెస్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి బోర్డుపై పావులు కదిపి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం క్రీడతో ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా విద్యార్థులు చదువులోనూ రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ…
ఎస్.కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు
పాణ్యం, మే 10: నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్.కొత్తూరులోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. సర్పసూక్త పారాయణంతో కూడిన మహాభిషేకం, మహానివేదన మరియు మంగళహారతులు శాస్త్రోక్తంగా జరిగాయి. సుమారు 400 మంది భక్తులు స్వామివారికి…
