RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
14-10-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

బక్రీద్ పండుగ సందర్భంగా మునుగోడు రోడ్డులోని ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 27 .(డిగ్నిటీ న్యూస్): బక్రీద్ పండుగను పురస్కరించుకొని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద చేపట్టిన ఏర్పాట్లను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు.ప్రార్థనలకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ పండుగను ప్రశాంత…

గడుపూటి నారాయణస్వామికి ఘన సన్మానం

దివ్యాంగుల సంక్షేమానికి గుర్తింపుగా పదవి మంత్రి ఎన్‌.ఎమ్.డి. ఫరూక్ కార్యాలయంలో కేక్ కటింగ్ కూటమి ప్రభుత్వానికి ‘డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ కృతజ్ఞతలు నంద్యాల, మే 27 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా, నంద్యాల నియోజకవర్గ పరిశీలకునిగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామిని ‘డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ’ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. స్థానిక మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌.ఎమ్.డి. ఫరూక్ కార్యాలయంలో…

నకిరేకల్ లో జరిగే జర్నలిస్టుల జిల్లా మహాసభను జయప్రదం చేయండి

జిల్లా మహాసభలకు హాజరుకానున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సభాస్థలిని పరిశీలించిన యూనియన్ నాయకులు జిల్లా వ్యాప్తంగా తరలిరానున్న 300 మంది జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే(ఐజేయు) నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులు చెరుకు సతీష్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి , మే 28 . (డిగ్నిటీ న్యూస్). జూన్ 3 వ తేదీన నకిరేకల్ పట్టణంలోని వినాయక బంకెట్ హాల్ లో జరిగే టి యు డబ్ల్యూ జే ( ఐజేయు )…

విద్యుత్ నగర్ కాలనీలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

పరిష్కారమైన లోవోల్టేజ్ సమస్య కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 27 .(డిగ్నిటీ న్యూస్).నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 13వ డివిజన్ విద్యుత్ నగర్ కాలనీలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుతో ఎట్టకేలకు విద్యుత్ లో-వోల్టేజ్ సమస్య పరిష్కారమైంది.కాలనీలో ఉన్న లో వోల్టేజ్ సమస్యను కాలనీ ప్రజలు ఇటీవల 13వ డివిజన్ కార్పొరేటర్ గుముల జానకి…

నల్లగొండ టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 27 .(డిగ్నిటీ న్యూస్). నల్లగొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి , నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ ఎల్వి యాదవ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి…

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు..

చెక్కులు అందజేసిన డీజీపీ హైదరాబాద్, మే 26 (డిగ్నిటి న్యూస్): మావోయిస్టు పార్టీలో నాలుగున్నర దశాబ్దాల పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ పని చేశారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో మీడియా ఎదుట నరహరితోపాటు ఆయన భార్య ధనమ్మను తెలంగాణ పోలీసులు ప్రవేశపెట్టారు. లొంగిపోయిన వారిద్దరికి రూ. 25 లక్షలు, రూ.20 లక్షలు చొప్పున డీజీపీ చెక్కులు అందజేశారు. అనంతరం డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 47…

ఈసారి గోవధ వద్దు.. సామరస్యంతో బక్రీద్ జరుపుకుందాం

నల్గొండ, మే 26 (డిగ్నిటి న్యూస్): ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్లిం మత పెద్దలు బక్రీద్ పండుగను శాంతి, సోదరభావ వాతావరణంలో నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. త్యాగం, సేవాభావానికి ప్రతీకగా భావించే బక్రీద్‌ను పరస్పర గౌరవంతో జరుపుకోవాలని సూచించారు. బక్రీద్ అంటే కేవలం ఖుర్బానీ మాత్రమే కాదని, పేదలకు సహాయం చేయడం, ఆహారం పంచుకోవడం, మానవత్వాన్ని చాటడం పండుగ అసలు సందేశమని వివరించారు. సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గోవధ…

లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత

మేడ్చల్-మల్కాజిగిరి, మే 26 (డిగ్నిటి న్యూస్): షామీర్‌పేట్ మండల తహసీల్దార్‌, కార్యనిర్వాహక న్యాయాధికారి, సంయుక్త ఉప-నమోదుదారుగా పనిచేస్తున్న సుచరితను అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వ్యవసాయ భూమి వినియోగ మార్పు దరఖాస్తుల అనుమతుల కోసం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో తొలి విడతగా రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆమె వ్యక్తిగత వాహనదారుడు నాగేష్ ద్వారా లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుబడినట్లు అధికారులు తెలిపారు….

నకిరేకల్‌లో జూన్‌ 3న టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 26 (డిగ్నిటి న్యూస్): TUWJ (IJU) జిల్లా మహాసభను జూన్‌ 3న నకిరేకల్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. మహాసభకు ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కే. శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి…

Exit mobile version