DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
బక్రీద్ పండుగ సందర్భంగా మునుగోడు రోడ్డులోని ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
News

బక్రీద్ పండుగ సందర్భంగా మునుగోడు రోడ్డులోని ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

27 May 2026, 09:38 AM   |   Dignity News

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 27 .(డిగ్నిటీ న్యూస్): బక్రీద్ పండుగను పురస్కరించుకొని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద చేపట్టిన ఏర్పాట్లను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు.ప్రార్థనలకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.పండుగ సందర్భంగా సామరస్య వాతావరణాన్ని కాపాడాలని, యువత సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బి సీఐ ఆది రెడ్డి, 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి,జిల్లా గ్రంధాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్,డిప్యూటీ మేయర్ ఆమేర్,కార్పొరేటర్స్,ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.