నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): ఎస్సీ కుటుంబాల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం లక్ష్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో బుధవారం జాయింట్ ఐడెంటిఫికేషన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర పాల్గొని ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాల ప్రాముఖ్యతను వివరించారు. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్‌లకు మొత్తం 47 యూనిట్లు మంజూరు కాగా,…
ధాన్యం కొనుగోలు కేంద్రాల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. బుధవారం కలెక్టర్‌ను కలిసి పలుచోట్ల రైతులను మోసం చేస్తున్న అంశాలకు సంబంధించిన ఆధారాలను అందజేశారు.కనగల్ మండలం జి.ఎడవెల్లి కేంద్రంలో రెండు రకాల ట్రక్‌షీట్లు ఉపయోగిస్తూ రైతులకు ఒక తూకం, మిల్లర్లకు మరో తూకంతో రికార్డులు…
బెస్ట్ అవైలబుల్ స్కీంలో దళిత విద్యార్థులకు మరిన్ని సీట్లు కేటాయించాలి
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): బెస్ట్ అవైలబుల్ స్కీం కింద దళిత విద్యార్థులకు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో మరిన్ని సీట్లు కేటాయించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం పరిమిత పాఠశాలలకే స్కీం పరిమితమవుతోందని తెలిపారు. గతంలో సెయింట్ ఆల్ఫోన్సస్, లిటిల్ ఫ్లవర్…
పాణ్యం చెంచు కాలనీలో 11 మంది బైండోవర్
పాణ్యం, మే 20 (డిగ్నిటి న్యూస్): పాణ్యం చెంచు కాలనీలో గతంలో నాటుసారా కేసుల్లో పట్టుబడిన 11 మంది పాత ముద్దాయిలను ఎక్సైజ్ అధికారులు బైండోవర్ చేశారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్.రవికుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన సిబ్బంది వారిని గుర్తించి పాణ్యం తహశీల్దార్ ఎదుట హాజరుపరిచారు. ఇకపై ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని వారు హామీ ఇవ్వడంతో పూచీకత్తు తీసుకున్నారు. మళ్లీ అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని…
మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రభుత్వ పాఠశాలలను కే పి జి హెచ్ ఎస్ బొట్టుగూడ లాగా అభివృద్ధి చేయాలి
తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, పూర్వ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు పూర్వ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల ప్రభుత్వ, జిల్లా పరిషత్ & ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి వసతులు, విద్యార్థుల సంఖ్యను పరిశీలించగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రభుత్వ ఉన్నత & ప్రాథమిక పాఠశాల…
ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి
బనగానపల్లెలో మెడికల్ స్టోర్స్ అసోసియేషన్ భారీ ర్యాలీ బనగానపల్లె, మే 20: ఆన్‌లైన్‌లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న మందుల విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బనగానపల్లె పట్టణంలో మెడికల్ స్టోర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆల్ ఇండియా సమ్మెతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపులో భాగంగా స్థానిక ఔషధ దుకాణాలను పూర్తిగా మూసివేసి నిరసన తెలిపారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు తహసీల్దార్ మంజునాథరెడ్డి, ఎస్సై దుగ్గిరెడ్డిలను…
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీల హడావుడి..
వసతుల లేమితో ప్రయాణికుల ఇబ్బందులు ఈడీ పర్యటనలో రికార్డుల పరిశీలన.. కంపు కొడుతున్న మూత్రశాలలను పట్టించుకోని వైనం నంద్యాల, మే 19 (డిగ్నిటి న్యూస్): నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) ఎస్.టి.పి. రాఘవకుమార్ తనిఖీల పర్యటన మంగళవారం హడావుడిగా సాగింది. డిపోలోని రికార్డు రూములు, డిస్పెన్సరీ, కార్గో విభాగాలను పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. అయితే, అధికారులు కార్యాలయాల తనిఖీల్లో బిజీగా ఉన్న సమయంలో.. బస్టాండ్‌కు వచ్చే…
చిన్నారుల జీవితాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
నంద్యాల, మే 19 (డిగ్నిటి న్యూస్): దేశ ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేసే చిన్నారుల జీవితాలను ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (సిఐఒ) రాష్ట్ర కార్యదర్శి మౌలానా గౌస్ పీర్ నిజామి పేర్కొన్నారు. స్థానిక యాంటీ కోట మసీదులో నాలుగు రోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల హృదయాలలో ప్రేమ, దేశభక్తి పెంపొందేలా పెద్దలు మసలుకోవాలన్నారు. జమాఆతె…
ఇంధన ధరల పెంపుపై పాండురంగా రెడ్డి నిరసన
హైదరాబాద్, మే 19 (డిగ్నిటి న్యూస్): అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ చమురు సంస్థలు సామాన్యుడిపై భారం మోపడం సరికాదని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఐదు రోజుల వ్యవధిలోనే రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం అత్యంత బాధాకరమన్నారు. గత శుక్రవారం లీటరుకు రూ. 3 పెంచిన సంస్థలు, నేడు మరో రూపాయి వరకు పెంచడం దారుణమన్నారు….
చదువుతోనే ఉజ్వల భవిష్యత్: బిసి రాజారెడ్డి
బనగానపల్లె, మే 19 (డిగ్నిటి న్యూస్): చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ సాధ్యమవుతుందని బనగానపల్లె మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి అన్నారు. పట్టణంలోని కరీంబాగ్‌లోని ఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు.ఇల్లూరు కొత్తపేట జెడ్పీ హైస్కూల్‌కు చెందిన యెగిలిశెట్టి సాయి చేతన్ 600కు గాను 590 మార్కులు సాధించి నియోజకవర్గ స్థాయిలో ప్రథమ ర్యాంకు పొందడంతో రూ.50 వేల నగదు…
