RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

పాణ్యం చెంచు కాలనీలో 11 మంది బైండోవర్

పాణ్యం, మే 20 (డిగ్నిటి న్యూస్): పాణ్యం చెంచు కాలనీలో గతంలో నాటుసారా కేసుల్లో పట్టుబడిన 11 మంది పాత ముద్దాయిలను ఎక్సైజ్ అధికారులు బైండోవర్ చేశారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్.రవికుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన సిబ్బంది వారిని గుర్తించి పాణ్యం తహశీల్దార్ ఎదుట హాజరుపరిచారు. ఇకపై ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని వారు హామీ ఇవ్వడంతో పూచీకత్తు తీసుకున్నారు. మళ్లీ అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version