RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

నల్లగొండ టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 27 .(డిగ్నిటీ న్యూస్). నల్లగొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి , నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ ఎల్వి యాదవ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను మహానాడు వేదికగా 27, 28, 29 తేదీలలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది.ఎప్పటి లాగా ఈసారి కూడా జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడానికి కొన్ని కారణాల దృశ్య ఘనంగా నిర్వహించలేక వర్చువల్ కార్యక్రమాల ద్వారా నిర్వహించుకుంటున్నాం, దానిలో భాగంగా బుధవారం నల్లగొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి తెలుగుదేశం పార్టీ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది, రేపు ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆయన తెలుగుదేశం పార్టీని ఏ ఆశయంతో స్థాపించారో అట్టి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రస్తుత జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజలే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ విషయంగా పార్టీని నడిపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరేళ్ల విజయ్ కుమార్ గుండు వెంకటేశ్వర్లు తేలు అన్న రవి ఎంకేఐ సిద్ధిక్ దొంతినేని నరసింహారావు అండ్ ఎం తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Chintha Yadaiah
Chintha Yadaiah
Reporter
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully