RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

విద్యుత్ నగర్ కాలనీలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

పరిష్కారమైన లోవోల్టేజ్ సమస్య

కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 27 .(డిగ్నిటీ న్యూస్).నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 13వ డివిజన్ విద్యుత్ నగర్ కాలనీలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుతో ఎట్టకేలకు విద్యుత్ లో-వోల్టేజ్ సమస్య పరిష్కారమైంది.కాలనీలో ఉన్న లో వోల్టేజ్ సమస్యను కాలనీ ప్రజలు ఇటీవల 13వ డివిజన్ కార్పొరేటర్ గుముల జానకి మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ల దృష్టికి తీసుకుపోవడంతో వారు నూతన ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయించడం జరిగింది. దీంతో ఎంతో కాలంగా కాలనీలో ఉన్న లో వోల్టేజ్ సమస్య పరిష్కారం అయింది .కాలనీలో లో వోల్టేజీ సమస్య పరిష్కారం కావడం పట్ల13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి కి, నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి గాకి కాలని వాసులందరూ ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు విద్యుత్ నగర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంచరకుంట్ల వెంకటరెడ్డి, బండ శ్రీనివాస్ రెడ్డి,గోగిరెడ్డి యాదగిరి రెడ్డి, కత్తుల రాంబాబు,పాలాది సంపత్,చెరుపల్లి మురళి, బొజ్జ వెంకన్న,కొప్పుల వెంకటరెడ్డి,రమేష్ గౌడ్, వెంకట్ గౌడ్,గుజ్జుల నాగిరెడ్డి, శ్రీకాంత్,గోవర్ధనగిరి, కాలనీవాసులు పాల్గొన్నారు.

Chintha Yadaiah
Chintha Yadaiah
Reporter
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully