RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

నిరుద్యోగ యువతకు ‘నాక్’ ఓ వరం

నల్గొండ, మే 9 (డిగ్నిటి న్యూస్): జిల్లాలోని నిరుద్యోగ యువత జాతీయ నిర్మాణ అకాడమీ (నాక్) అందిస్తున్న ఉచిత శిక్షణను అందిపుచ్చుకుని ఉపాధి రంగంలో రాణించాలని సీటీటీఐ డైరెక్టర్ ఎం. రాజిరెడ్డి సూచించారు.

నల్గొండలోని నాక్ కేంద్రాన్ని శుక్రవారం ఆయనతో పాటు గోన రెడ్డి, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్, శశిపితం సహా పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో కొనసాగుతున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ప్లేస్‌మెంట్ అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించి, వారి అభిప్రాయాలను సేకరించారు.యువత ఉజ్వల భవిష్యత్తుకు నాక్ కేంద్రం ఎంతగానో దోహదపడుతోందని రాజిరెడ్డి కొనియాడారు. ఇక్కడి శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు మరియు నిర్వహణ తీరుపై సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. కేంద్రంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలు, యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను కలెక్టర్‌కు వివరించారు. నాక్ అందిస్తున్న సేవలను అభినందించిన కలెక్టర్, భవిష్యత్తులో యువతకు మరింత మేలు చేకూరేలా కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully