RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

కల్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 27 (డిగ్నిటీ న్యూస్): కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య అన్నారు. మాడుగుల పల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సరోజా పావనితో కలిసి బుధవారం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాల అమలవుతున్నాయని, ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చులను ఆర్థిక భారం తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ తమ వంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పూసలపాడు సర్పంచ్ సైదిరెడ్డి, గజలాపురం సర్పంచ్ రోజా, అవంగాపురం సర్పంచ్ జానయ్య, కాంగ్రెస్ పార్టీమాడుగుల పల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్, పుల్లెంల నరసింహ, డిప్యూటీ తహసీల్దార్ కత్తుల సైదులు, తదితరులు పాల్గొన్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully