నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.మే 28. (డిగ్నిటీ న్యూస్): నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో జూన్ 3వ తేదీన నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా మహాసభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం నల్లగొండ డివిజన్ అధ్యక్షుడు జిల్లా యాదయ్య, ప్రధాన కార్యదర్శి కత్తుల యాదగిరి లు పిలుపునిచ్చారు.పట్టణంలో నిర్వహించిన టీయూడబ్ల్యూజే సమావేశంలో వారు మాట్లాడుతూ నల్లగొండ డివిజన్‌లో చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రచారానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు,చిన్న పత్రికల జర్నలిస్టులు,ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందన్నారు.జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలం, గృహ నిర్మాణం, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు అందేలా యూనియన్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ఈ జిల్లా మహాసభ వేదిక కానుందని ఈ మాసభకు మహాసభకు నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం, తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి,టియూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రామ నారాయణ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డిలు హాజరవుతున్నట్లు తెలిపారు.సమావేశంలో సంఘం నాయకులు చింత యాదగిరి, తెల్గమళ్ల దశరథ్, బోగారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.అనంతరం సంఘం సభ్యత్వం అందజేశారు.
జూన్ 3న నకిరేకల్ లో నిర్వహించే టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభకు జర్నలిస్టులు తరలిరావాలి
