మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రభుత్వ పాఠశాలలను కే పి జి హెచ్ ఎస్ బొట్టుగూడ లాగా అభివృద్ధి చేయాలి

తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, పూర్వ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు పూర్వ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల ప్రభుత్వ, జిల్లా పరిషత్ & ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి వసతులు, విద్యార్థుల సంఖ్యను పరిశీలించగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రభుత్వ ఉన్నత & ప్రాథమిక పాఠశాల బొట్టు గూడలను, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ కుమారుని పేరిట ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ ట్రస్టు ద్వారా ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనాన్ని నిర్మించి కల్పించిన సౌకర్యాల కారణంగా అత్యధిక సంఖ్యలో అడ్మిషన్లు జరిగుతున్నవి.పాఠశాలలకు ఆధునిక వసతులతో కొత్త భవనాన్ని నిర్మించడం వలన అడ్మిషన్ల వెల్లువ కొనసాగుతుందని ఈ సంఘటన నిరూపిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలకు ఆధునిక సౌకర్యాలతో భవనాలు ఉంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఘటన తెలుపుతుంది.


నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 44044 విద్యార్థులు 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్నారు. వీరిలో 89.7% ప్రైవేటు పాఠశాలల్లో, 10.3% ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. నల్లగొండ కార్పొరేషన్ లో 56 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 38 ప్రాథమిక, 3 ప్రాథమికోన్నత, 15 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కావున ఇదే పద్ధతిలో మరి కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక సౌకర్యాలతో భవనాలను నిర్మిస్తే, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తూ, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు పిల్లల చదువుల భారం తగ్గుతుంది. నల్లగొండ కార్పొరేషన్ లోని 23 డివిజన్ లో ఉన్న రామగిరి , బోయవాడ పాఠశాలలను విలీనం చేసి ఒకే చోట ఏర్పాటు చేస్తే సుమారు 1000 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. 4 వ డివిజన్ లోని కేశరాజు పల్లి, 27 వ డివిజన్ లోని జేబీఎస్, 15వ డివిజన్ లోని చర్లపల్లి, 14 డివిజన్ లోని మర్రిగూడ, 9 వ డివిజన్లోని అక్కలాయగూడెం పాఠశాలలను కే పి జి హెచ్ ఎస్ లాగా అభివృద్ధి చేస్తే ఆయా ప్రాంత విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అని కోరుతూ రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి (వారి పీఏ ద్వారా) , నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య రెడ్డి లకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌర స్పందన వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి, కోశాధికారి వాణిశ్రీ, కార్యదర్శులు జి బిక్షమయ్య, ఎస్ వెంక రెడ్డి, టీఎస్ యుటిఎఫ్ నుండి నర్రా శేఖర్ రెడ్డి, నలపరాజు వెంకన్న లు పాల్గొన్నారు ‌

Translate »