మిల్లర్ల దోపిడీని నివారించి,లారీల కొరతను తీర్చి రైతన్నలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
తెలంగాణ రైతు సంఘం
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5 .(డిగ్నిటీ న్యూస్) ఐకెపి,పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టి 42 కేజీల తూకం, మిల్లర్ల దోపిడీని నివారించుటకై, లారీలను సక్రమంగా రవాణా చేయుట గూర్చి తెలంగాణ రైతు సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో ఐకెపి,పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను మోసం చేస్తూ బస్తా కు 40 కేజీల కాంట వేసి కాళీ బస్తాకు 600 గ్రాములు వేయాల్సి ఉండగా 42 కేజీల తూకం వేస్తున్నారు. అదనంగా తాలు పేరుతో మిల్లర్లు బస్తాకు మూడు కేజీల చొప్పున లేదా క్వింటాల్ కు ఎనిమిది కేజీల నుండి 10 కేజీల వరకు తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటాలు వేసిన ధాన్యం వెంట వెంటనే రవాణా జరగటం లేదు లారీల కొరత కారణంగా రైతుల నుండి బస్తాకు మూడు రూపాయలు లారీ వాళ్ళు వసూలు చేస్తున్నారని రైతులు ముందుగా డబ్బులు ఇస్తేనే లారీలు పంపుతున్నారని వాపోయారు. ఇవ్వకపోతే లారీలు పంపమని లారీ యజమానులు అంటున్నారని తెలిపారు.హాకా,మార్క్ ఫెడ్ నిర్వహ ణలో ఉన్న సెంటర్లలో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకు మార్కెట్ నిర్వ హణ బాధ్యత అప్పగించినారు.వారు రైతులను ఇబ్బందులకు గు రిచేస్తున్నారు.వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభం కావస్తున్నది కేంద్రాలలో ధాన్యం కొనుగోలు నత్త నడకన నడుస్తున్నాయి. ఎండల తీవ్రత బాగా పెరుగుతున్నది రైతులు వడదెబ్బకు గురి అవుతున్నారు. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు త్రాగునీరు, నీడ లేక హామాలీలు,రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.అకాల వర్షాలకు ధాన్యం తడిసె ప్రమాదం ఉందని తార్పల్లీన్స్,పట్టాలు లేవు గత వారం రోజులుగా సెంటర్లకు లారీలు సక్రమంగా రావడం లేదని కావున యుద్ధ ప్రాతిపదిక ధాన్యం కొనుగోల్ల ను వేగవంతం చేసి కాంటాలు వేసి వెంటవెంటనే రవాణా చేసి మే 20 వరకు పూర్తిగా కొనుగోలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకొని రైతులకు జరుగుతున్న మోసాలు అరికట్టి, రైతులకు అండగా నిలవాలని తెలంగాణ రైతు సంఘం నల్గొండ జిల్లా కమిటీ ద్వారా తమరిని కోరుతున్నామని లేని పక్షంలో రైతులని కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని తెలిపారు.ఈ వినతి పత్రం సమర్పించిన దానిలో రైతు సంగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మహిళా రైతు రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి, దేవి రెడ్డి అశోక్ రెడ్డి, జిల్లా నాయకులు నన్నూరి వెంకటరమణారెడ్డి , నల్పరాజు సైదులు, సాగర్ల మల్లేష్ ఆరూరి శ్రీనివాస్, వెంకన్న, శంకర్ రెడ్డి, ఊర్మిళ,నాగమణి,సిహెచ్ వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.పై వార్తను కొంచెం తగ్గించి ఈనాడు దినపత్రిక స్టైల్ లో వార్తను అందించగలరు వార్తలో బులిటెన్ పాయింట్ లేకుండా చూడగలరు
