నకిరేకల్‌లో రూ.6 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

ప్రభుత్వ విప్ వేముల వీరేశం.

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5. (డిగ్నిటీ న్యూస్): నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.6 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.అదేవిధంగా ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం కోసం మరో 20 లక్షలు కేటాయించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నకిరేకల్‌లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.పట్టణంలో మీ మీ ప్రాంతాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి, వెంటనే పనులు పూర్తి చేస్తాం” అని హామీ ఇచ్చారు.ఇండ్లు లేని పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు.

“బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో ఆర్థిక విధ్వంసం చేశారు.ఖజానా ఖాళీ చేశారు తప్పితే అభివృద్ధి పనులు చేయలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన తీసుకొచ్చింది” అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం రాయం కొససాగిస్తుంది అని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు.”కేరళలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచింది. ఈ క్రెడిట్ రాహుల్ గాంధీ దే. అదే సమయంలో మన సీఎం రేవంత్ రెడ్డి కి కూడా సగం క్రెడిట్ దక్కుతుంది” అని ఎమ్మెల్యే వీరేశం పేర్కొన్నారు.

Translate »