RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు గుమ్ముల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య

జి.చెన్నారంలో వైభవంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

నల్లగొండ నియోజకవర్గం, జూన్ 18 (డిగ్నిటీ న్యూస్): నల్లగొండ మండలం జి.చెన్నారం గ్రామంలో పగిళ్ల జానయ్య-అలివేలు దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై, నూతన ఇందిరమ్మ ఇంటిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక సహకారంతో నల్లగొండ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేద లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తమ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ఫారూఖ్, జి.చెన్నారం మాజీ సర్పంచ్ ఉప్పునూతల వెంకన్న యాదవ్, జిల్లపల్లి వెంకన్న, సత్తయ్య, జిల్లపల్లి శ్రీను, సైదులు, గిరి, మైసయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Gundeboina Venkanna Yadav
Gundeboina Venkanna Yadav
Sub Editor
Nalgonda Dist.
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully