ఫిక్స్డ్ వేతనం 18000 హామీ అమలు చేయాలి: సిఐటియు
ప్రజావాణిలో కలెక్టర్ కు ఆశల వినతి
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . మే 11. (డిగ్నిటీ న్యూస్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తవిటి వెంకటమ్మ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చే అతి తక్కువ పారితోషికాలు కూడా నెల నెల రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఆశా వర్కర్లకు ఏప్రిల్ నెల పారితోషికం ఇప్పటివరకు రాలేదు. పారితోషికం రాక ఆశా వర్కర్లు అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారు. అవసరాల కోసం ఆశా వర్కర్లు అప్పులు చేయాల్సి వస్తుంది. ఇ.ఎం.ఐ. లు కట్టలేక ఆశాలు అల్లాడుతున్నారు. ఆశాల ఆర్ధిక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం అర్ధం చేసుకొని వెంటనే ఏప్రిల్ నెల పారితోషికం చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీన పారితోషికాలు వచ్చే విధంగా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు. వీరంతా మహిళలు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులున్నారు. నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ద సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం గ్యారెంటీ ఫిక్సిడ్ వేతనం కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారని గుర్తు చేశారు ఆ సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అయినా నేటికి వేతనాలు పెంచలేదు. 50 లక్షల ఇన్సూరెన్స్, 50వేల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినా, ఇంకా అమలు చేయటం లేదు. పి.ఆర్.సి. ఎరియర్స్, లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పి.ఆర్.సి. ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, 2022 నుండి 2025 వరకు నాలుగు సంవత్సరాల లెప్రసీ సర్వే, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ పెండింగ్ డబ్బులు చెల్లించాలని కోరారు.ఎగ్జామ్ డ్యూటీలకు అదనపు పారితోషికాన్ని ప్రభుత్వం నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 50 లక్షల ఇన్సూరెన్స్, 50వేల మట్టి ఖర్చులకు వెంటనే జి.ఓ. లు ఇవ్వాలని,పి.ఎఫ్., ఇ.ఎస్.ఐ., సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని. ఎ.ఎన్.ఎం, జి.ఎన్.ఎం. ట్రైనింగు్పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం వెంటనే నిర్ణయించాలని కోరారు.గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆదివారం , పండుగలకు సెలవులు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని,ఆశాలతో ఎన్ సి డి ఆన్లైన్ పని చేయించకూడదు.స్పూటమ్ డబ్బాలు మోయించకూడదు. పూనమ్ క్లాత్తో కూడిన క్వాలిటీ యూనిఫాం సప్లై చేయాలని కోరారు ఆశాలు చేస్తున్న పారితోషికం లేని పనులన్నింటిని గుర్తించాలని,ప్రభుత్వ అన్ని ఆస్పత్రుల్లో ఆశాలకు ప్రత్యేకంగా రెస్టు రూమ్ లు ఏర్పాటు చేయాలి. ఆశాలకు పనిభారం తగ్గించాలి. పారితోషికం లేని పనులు చేయించకూడదు.ఆశాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించని యడల జూలైలో సమ్మె చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ వీరభద్రమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లకపాక రాజు, జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, అవుట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు ఆదిమల్ల సుధీర్, ఆశా వర్కర్లు ప్రేమలత, వజ్రమ్మ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
