పీఏసీఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆలకుంట్ల నాగరత్నం రాజు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 4. (డిగ్నిటీ న్యూస్).ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నల్లగొండ గొల్లగూడ పి ఎ సి ఎస్ చైర్మన్ గా ఆలకుంట్ల నాగరత్నం రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించినట్లు చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు వెల్లడించారు . ఈ సందర్భంగా నాగరతం రాజు మాట్లాడుతూ గోల్లగూడ పీ ఏ సీ ఎస్ నుండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తూ, రైతులకు సకాలంలో ఋణాలు అందించడానికి కృషి చేస్తానని అన్నారు . రైతులకు సేవ చేయడం ఎంతో అదృష్టం అని, వారికి ఎలాంటి కష్టాలు ఎదురు కాకుండా *రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తూ సొసైటీని మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేస్తానని అన్నారు.ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు సిబ్బంది , అభిమానులు చైర్మన్ ను పూల మాలలు, బోకే, శాలువాతో అభినందిస్తూ సన్మానించారు .

Translate »