ధాన్యం కొనుగోలు కేంద్రాల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. బుధవారం కలెక్టర్‌ను కలిసి పలుచోట్ల రైతులను మోసం చేస్తున్న అంశాలకు సంబంధించిన ఆధారాలను అందజేశారు.కనగల్ మండలం జి.ఎడవెల్లి కేంద్రంలో రెండు రకాల ట్రక్‌షీట్లు ఉపయోగిస్తూ రైతులకు ఒక తూకం, మిల్లర్లకు మరో తూకంతో రికార్డులు ఇస్తున్నారని ఆరోపించారు. తిప్పర్తి మండలంలోని మర్రిగూడెం, ఇండ్లూరు, మామిడాల తదితర కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెచ్చి స్థానికంగా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. నల్లగొండ మండలం అన్నెపర్తి కేంద్రంలో ఇప్పటికీ 25 శాతం కొనుగోళ్లు కూడా పూర్తికాలేదని పేర్కొన్నారు.ఈ అంశాలపై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాసరెడ్డి, మేక అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Translate »