RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ఫైనాన్స్ మేనేజర్ వేధింపులపై చర్యలు తీసుకోవాలి: సీపీఐ డిమాండ్

నంద్యాల, మే 26 (డిగ్నిటి న్యూస్): పిరమల్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆపరేషన్ మేనేజర్ (BOM) వై. కృష్ణ వేధింపుల వల్లే కార్యాలయ బాయ్ సాంబశివుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సీపీఐ పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్ ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆయన పరామర్శించారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ.. రెండేళ్లుగా పని చేస్తున్న సాంబశివుడు అనారోగ్యం వల్ల రెండు రోజులు రాలేకపోతే, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగించారని మండిపడ్డారు. నలుగురు పిల్లలను ఎలా పోషించాలో తెలియక మనస్తాపంతో సాంబశివుడు నిన్న సాయంత్రం బలవన్మరణానికి యత్నించాడన్నారు. బాధితుడికి ఏమైనా జరిగితే మేనేజర్ కృష్ణదే పూర్తి బాధ్యతని, ఆయనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని సాంబశివునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully