RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

గడుపూటి నారాయణస్వామికి ఘన సన్మానం

దివ్యాంగుల సంక్షేమానికి గుర్తింపుగా పదవి

మంత్రి ఎన్‌.ఎమ్.డి. ఫరూక్ కార్యాలయంలో కేక్ కటింగ్

కూటమి ప్రభుత్వానికి ‘డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ కృతజ్ఞతలు

నంద్యాల, మే 27 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా, నంద్యాల నియోజకవర్గ పరిశీలకునిగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామిని ‘డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ’ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. స్థానిక మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌.ఎమ్.డి. ఫరూక్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నారాయణస్వామికి అసోసియేషన్ నాయకులు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం: డీపీ. మస్తాన్ వలి

అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డీపీ. మస్తాన్ వలి మాట్లాడుతూ… గడుపూటి నారాయణస్వామి సుదీర్ఘకాలంగా దివ్యాంగుల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి కూటమి ప్రభుత్వం నంద్యాల నియోజకవర్గ పరిశీలకునిగా బాధ్యతలు అప్పగించడం హర్షణీయమన్నారు. దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సన్మాన మహోత్సవంలో నాలుగవ వార్డు టిడిపి మహిళా నాయకురాలు వహీదా, యువ నాయకులు ఖాదర్ బాషా, డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శి ఎల్లయ్య, సభ్యులు మనన్, ఖాదర్ బాషా, డిజేబుల్డ్ ఎంప్లాయిస్ సంఘం నాయకులు మురహరి రావు, అబ్దుల్ జలీల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొని నారాయణస్వామికి అభినందనలు తెలిపారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully