RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

నిశ్శబ్ద పోరాటం

వాస్తవ పరిస్థితి

​ పట్టణంలో ఉన్న మెడికల్ షాపుల యజమానుల మనసుల్లో మాత్రం ఒక తెలియని అలజడి. నా షాపు ముందు నిలబడి 1997 నుండి మారుతున్న కాలాన్ని గమనిస్తున్న నాకు నా మెడికల్ షాప్ మరియు, మెడికల్ ఏజెన్సీ వాస్తవ పరిస్థితి నా లాగా ఎందరో
​మాయమవుతున్న ‘చిన్న’ ఉనికి…..

​ఐదేళ్ల క్రితం వరకు పరిస్థితి వేరు. షాపుకు వచ్చే కస్టమర్లతో ఒక ఆత్మీయ అనుబంధం ఉండేది. కానీ ఇప్పుడు? కార్పొరేట్ మెడికల్ చైన్ షాపుల రాకతో వ్యాపార ముఖచిత్రమే మారిపోయింది. ఒకప్పుడు పది శాతం డిస్కౌంట్ అంటేనే అబ్బురపోయే రోజులు పోయి, ఇప్పుడు 15% నుండి 18% వరకు డిస్కౌంట్ ఇస్తేనే కస్టమర్ షాపు గడప తొక్కుతున్నాడు

​”పోటీ అనేది ఉండాలి, కానీ అది ఒకరినొకరు మింగేసేలా ఉండకూడదు,” అని నా అంతరంగం

​హోల్సేల్ – రిటైల్: ఒకే నాణేనికి రెండు వైపులా కన్నీళ్లు

​హైదరాబాద్ పట్టణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కేవలం రిటైలర్లే కాదు, వాళ్లకు సరుకు సరఫరా చేసే హోల్సేలర్లు కూడా ఊపిరి సలపని స్థితిలో ఉన్నారు.

​అదనపు డిస్కౌంట్లు: రిటైలర్ల ఖాతాలు కాపాడుకోవడానికి హోల్సేలర్లు తమ లాభాన్ని వదులుకుంటున్నారు.

​మొండి బాకీలు: ఏడాది పొడవునా నమ్మకంతో ఇచ్చిన సరుకుకు డబ్బులు రాక, కొన్ని షాపులు బోర్డు తిప్పేయడంతో హోల్సేలర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

​బతుకు బండి.. భారమైన ప్రయాణం
​చాలామందికి ఈ రంగం తప్ప వేరే దారి తెలియదు. చదివిన చదువు, సంపాదించిన అనుభవం అంతా ఈ మందుల మధ్యనే. అందుకే లాభం లేకపోయినా, అప్పులు పెరుగుతున్నా.. ‘బతుకు బండి’ని లాగక తప్పడం లేదు.

​పెద్ద చేప చిన్న చేపను మింగే చందాన, భవిష్యత్తులో కేవలం భారీ పెట్టుబడులు ఉన్న కార్పొరేట్ శక్తులు మాత్రమే మిగిలేలా కనిపిస్తున్నాయి.

చిన్న వ్యాపారస్తుల నిస్తేజం కళ్లముందే కనిపిస్తున్న చేదు నిజం.
కాలమే సమాధానం చెప్పాలి
​వ్యాపారంలో పోటీ ఉండవచ్చు, కానీ ఆ పోటీలో మానవీయ కోణాన్ని, చిన్న వ్యాపారస్తుల శ్రమను కోల్పోతున్నామా? అనే ప్రశ్న నా లాంటి ఎంతోమంది సీనియర్ల మదిలో మెదులుతోంది.

ఈ పోటీ తత్వంలో చివరికి ఎవరు మిగులుతారు? చిన్న వ్యాపారి మనుగడ సాధ్యమేనా? అనేది కాలమే నిర్ణయించాలి.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully