RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

వీరమల్ల వంశీకృష్ణ గౌడ్‌కు డాక్టరేట్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటీ న్యూస్): నల్లగొండ పట్టణం గాంధీనగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు వీరమల్ల వంశీకృష్ణ గౌడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి జియాలజీ విభాగంలో డాక్టరేట్ పొందారు. ప్రొఫెసర్ గుండా ప్రభాకర్ పర్యవేక్షణలో నల్లగొండ పరిసరాల్లోని గ్రానైట్ శిలలపై ఆయన చేసిన విశేష పరిశోధనకు గాను వర్సిటీ ఈ గౌరవాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, వంశీకృష్ణ సోదరుడు వీరమల్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఆయనను అభినందించారు. తన పరిశోధనకు సహకరించిన ప్రొఫెసర్‌కు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully