RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

బండి భగీరథను కఠినంగా శిక్షించాలి

బండి సంజయ్ కేంద్రం మంత్రివర్గం నుండి తొలగించాలి: డివైఎఫ్ఐ

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటీ న్యూస్): డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నల్గొండ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించారు, ఈ సందర్బంగా డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు నేరాలకు పాల్పడినా ప్రభుత్వం, పోలీసులు తక్షణ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.చట్టం అందరికీ సమానమైతే నిందితుడిపై వెంటనే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధిత బాలికకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించాలని, కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రత్యేక వేగవంతమైన విచారణ నిర్వహించాలని కోరారు. మహిళల భద్రతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే పాలకులు, ఇలాంటి ఘటనల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.బాధితులను భయపెట్టి నిందితులను కాపాడే ప్రయత్నాలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు.రాష్ట్రవ్యాప్తంగా యువజనులు, ప్రజాసంఘాలు ఈ ఘటనపై స్పందించాలి.
ఈ సమావేశంలో డి వై ఎఫ్ ఐ జిల్లా ఉపధ్యక్షులు గుండాల నరేష్,సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి జిల్లా నాయకులు పోకల శశిధర్, అంజి, కార్తీక్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు .

Chintha Yadaiah
Chintha Yadaiah
Reporter
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully