లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

నోయిదా ప్రాంతం లో అక్రమంగా అరెస్ట్ చేసిన కార్మికులను విడుదల చేయాలి

విద్యుత్ బస్ లను ఆర్టీసీ లకు ఇవ్వాలి.

సిఐటియునల్గొండ ఆఫీస్ నుండి బస్ స్టాండ్ మీరు గా క్లాక్ టవర్ వరకు కార్మికుల ప్రదర్శన

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 10 (డిగ్నిటీ న్యూస్): నూతనంగా అమలు లోకి తీసుకు వచ్చిన లేబర్ కోడ్ లు రద్దు చేయాలనీ టి ఎస్ ఆర్ టి సి ఎస్ డబ్ల్యూ ఎఫ్. ఆధ్వర్యంలో నల్గొండలో ప్రదర్శన జరిగింది.ఈ ప్రదర్శన నల్గొండ సిఐటియుఆఫీస్ నుండి క్లాక్ టవర్ చౌరస్తా వరకు జరిగింది.ఈ ప్రదర్శన లో టి ఎస్ ఆర్ టి సి ఎస్ డబ్ల్యూ ఎఫ్ ప్రధాన కార్యదర్శి వి. ఎస్. రావు,ఉప ప్రధాన కార్యదర్శి జి. లింగమూర్తి,ప్రచార కార్యదర్శి పి. రవీందర్ రెడ్డి, కోశాధికారి కె. ఎస్. రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గీత, ఎస్. కృష్ణ, సి .హెచ్. రాంచందర్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాస్, బి యూ చారి,బత్తుల. సుధాకర్, ఎస్ డబ్ల్యూ ఎఫ్ నల్గొండ రీజియన్ నాయకులు నర్సింహా, రసూల్, శ్యామ్ తదితరులు నాయకత్వం వహించగా, రాష్ట్ర నలుమూలల నుండి హాజరైన ఎస్ డబ్ల్యూ ఎఫ్ సభ్యులు ప్రదర్శన లో పాల్గొన్నారు.

నూతనంగా అమలు లోకి తెచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలనీ, కార్మికుల పైన నిర్భంధం ఆపాలని, నోయిదా లో అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలనీ, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, విద్యుత్ బస్ లు ఆర్టీసీ లకే ఇవ్వాలని ప్రదర్శుకుల నినాదాలతో నల్గొండ నగరం మార్మోగి పోయింది.అనంతరం టి ఎస్ ఆర్ టి సి ఎస్ డబ్ల్యూ ఎఫ్ (సీఐటీయూ ) రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నల్లగొండ లో ఎస్. కృష్ణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరారెడ్డి హాజరయి ప్రసంగిస్తూ భారత కార్మిక వర్గం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను అమలులోకి తెస్తున్నారు. ఫిబ్రవరి 12 న 30 కోట్ల కార్మికులు జాతీయ సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఏప్రిల్ నుండి అమలు లోకి తెచ్చారు. నోయిడా, మధ్య ప్రదేశ్ లో కనీస వేతనం పెంచాలని, 8 గంటల పని దినం కోసం పోరాడుతుంటే అరెస్టులు, జైలు పాలుజెస్తున్నారు. అందుకే దుర్మార్గమైన నూతన లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు. ఆర్టీసీ లను నిర్వీర్యం చేసే విద్యుత్ బస్సుల విధానం మార్పుచేసి వాటిని ఆర్టీసీ లకే కేటాయించలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ లో పని భారలు, వేధింపులు, యూనియన్ హక్కుల పునరుద్దరణ కోసంఆర్టీసీ కార్మికులు ఐక్యంగా పోరాడి విజయం సాధించినందుకు అభినందనలు తెలయజేశారు.

విలీనం భవిష్యత్ సమస్య ల పరిష్కారం కోసం జనరల్ బాడీ సమావేశం లో చర్చించి భవిష్యత్ కర్తవ్యాలు తీసుకోవాలన్నారు.ఎస్ డబ్ల్యూ ఎఫ్ ప్రధాన కార్యదర్శి వి. ఎస్. రావు జనరల్ బాడీ సమావేశం ఉద్దేశించి ప్రసంగించారు. 2019 నుండి యూనియన్ నిర్బంధ కాలము నుంచి స్వతంత్రంగా ఆర్టీసీ కార్మిక సమస్యలపై, సంస్థ రక్షణ కోసం పోరాడిందన్నారు. 2021 నుండి 9 సంఘాలతో జేఏసీ ఏర్పడి పనిచేసింది అన్నారు. 2023 నుండి విడివిడిగా రెండు జేఏసీలు పనిచేస్తున్న కాలంలో కార్మిక సంఘాలు ఐక్యంగా ఉండాలని, ఐక్య పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కారం ఆగితాయని కార్మికులను చైతన్యం చేసానన్నారు. 2026 ఏప్రిల్ లో వారి సంఘాల జేఏసీ సమ్మె పోరాటానికి మద్దతు తెలియజేసి, మిగతా సంఘాల మద్దతు కూడగట్టి ఏప్రిల్ 22న కార్మిక సంఘాల ఐక్యతతో సంపూర్ణ సమ్మె జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోర్ మెన్ కమిటీ ముందు, ప్రభుత్వ మంత్రుల ఉప సంఘం ముందు విలీనము, అనంతర సమస్యలు,యూనియన్ పునరుద్ధరణ, ఉద్యోగ భద్రత, సర్వీస్ కండిషన్ల, పే స్కేలు అలవెన్స్ లపై సరియైన సూచనలతో వినతి పత్రాలు సమర్పించామన్నారు. బస్సుల విధానం మార్పు చేసి, వాటిని ఆర్టీసీలకు కేటాయించాలన్నారు.జనరల్ బాడీ సమావేశానికి ముందు ఎస్డబ్ల్యుఎఫ్ జెండా ఆవిష్కరణ ప్రధాన కార్యదర్శి వి ఎస్ రావు ఆవిష్కరించారు.జనరల్ బాడీ లో లింగమూర్తి,కె. ఎస్. రెడ్డి, పి రవీందర్ రెడ్డి, బత్తుల సుధాకర్, రామచందర్, ఉపేంద్ర చారి ప్రసంగించారు . నల్లగొండ రీజియన్ అధ్యక్షలు నరసింహ, ఎస్.కె గులాం రసూల్, శ్యామ్ పాల్గొన్నారు.

Translate »