ప్రతిష్ఠా మహోత్సవానికి రూ. 10 వేల విరాళం

బేడా బుడగజంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు

బండి ఆత్మకూరు, మే 10 (డిగ్నిటి న్యూస్): మండలంలోని వెంగళరెడ్డి పేట గ్రామంలో ఈనెల 11న నిర్వహించనున్న గణపతి, రాములమ్మ, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవానికి బేడా బుడగజంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు రూ. 10 వేల విరాళం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ నాయకుడు తోట శివయ్య ఆహ్వానం మేరకు ఆయన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుగ్గరాముడు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ ఆదేశాల మేరకు మంగళవారం నిర్వహించే రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల పోటీలలో రెండు పండ్ల విభాగం నాలుగో బహుమతి నిమిత్తం ఈ నగదును అందజేస్తున్నట్లు ప్రకటించారు. తనను ఆహ్వానించిన కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాటికొండ మహేష్ బాబు, ఆరవీటి బాబు, తెలుగు వెంకటేశ్వర్లు, యడవల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

Translate »