నల్గొండ జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

నల్గొండ, మే 9 (డిగ్నిటి న్యూస్): కేతేపల్లి మండల పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం కొర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో H 38 F 3447 నంబర్ గల లారీని అనుమానంతో ఆపి పరిశీలించగా, అందులో భారీ మొత్తంలో గంజాయి బయటపడింది.

ఈ ఘటనపై కేతేపల్లి ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ, గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాజానికి తీవ్రమైన హానిని కలిగిస్తాయని, ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదం ఉందని తెలిపారు.

ఇలాంటి అక్రమ రవాణాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని చెప్పారు.ప్రజలు కూడా అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Translate »