RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మజ్జిగ పంపిణీ

నల్లగొండ, ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 8 (డిగ్నిటీ న్యూస్): వాసవి క్లబ్ కేసి జిఎఫ్ నల్గొండ ప్రెసిడెంట్ మిట్టపల్లి వాత్సవ్ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోగులకు పండ్లు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో యాచకులకు పేదలకు అన్నదాన వితరణ చేశారు. తదుపరి చెరువుగట్టులోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ సతీష్, ఐ ఈ సి మెంబర్ కోటగిరి రామకృష్ణ లు మాట్లాడుతూ వాసవి క్లబ్ సభ్యుల వివాహ వార్షికోత్సవాలు జన్మదినాల సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారని మానవసేవే మాధవసేవ అన్నారు. వాత్సవ్ జన్మదినము సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్ష, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ మల్లిక, నేస్తం సొసైటీ అధ్యక్షుడు వెంకన్న, శీను,రవి,యాదయ్య క్యాబినెట్ సెక్రటరీ నూనె కిషోర్ కుమార్, వైస్ గవర్నర్ తాళ్లపల్లి రాము, వాసవి క్లబ్ కేసి జిఎఫ్ కార్యదర్శి మురారిశెట్టి శంకర్, కోశాధికారితాడి శెట్టి సంతోష్, వాసవి క్లబ్ స్ఫూర్తి ప్రెసిడెంట్ సంతోషిని, కార్యదర్శి మురారి శెట్టి నందిని, కోశాధికారి తాడిచెట్టి విజయ, కోటగిరి దైవ దినం, గోవింద్ బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Chintha Yadaiah
Chintha Yadaiah
Reporter
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully