ఎన్ డి సి ఎం ఎస్ కేంద్రాలలో ధాన్యం ట్రాన్స్పోర్ట్ వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలి: సిపిఎం డిమాండ్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 4 (డిగ్నిటీ న్యూస్). ఎన్ డి సి ఎం ఎస్ కేంద్రాలలో వడ్ల కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్తంగా నెలకొన్నదని, రైతులను పట్టించుకునే పరిస్థితి లేకపోవడం దారుణమని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ విమర్శించారు. రైస్ మిల్లర్ల దోపిడి రోజురోజుకు పెరుగుతోందని, వెంటనే రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్గొండ మండలం జీకే అన్నారం గ్రామంలోని ఎన్ డి సి ఎం ఎస్ కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడిన ఆయన, కొనుగోలు కేంద్రాల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. సీరియల్ విధానం పాటించకుండా, ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.తాలు పేరుతో ప్రతి క్వింటాల్‌కు 3కిలోల 200 గ్రాములు కోత వేస్తున్నారని, అదీ కాక రైస్ మిల్లులకు ధాన్యం వెళ్లిన తర్వాత మరోసారి లారీల వద్ద 10నుంచి 20 క్వింటాళ్ల వరకు కోత వేయడం రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు.రైతులు మాట్లాడుతూ ఒడ్లు ఎండబెట్టడం, ట్రాక్టర్ కిరాయిలు, కోత అన్నీ కలిపి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ప్రకటించిన ధర రూ.2369 ఉన్నా, వాస్తవానికి వారికి కేవలం రూ.2000 మాత్రమే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీకే అన్నారం గ్రామంలో 160మంది రైతులు నమోదు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు 50 మంది రైతుల ధాన్యం లిఫ్టింగ్ జరిగిందని సుమారు 6 వేల క్వింటాళ్ల ధాన్యం తరలించినట్లు పేర్కొన్నారు. కొంతమంది రైతుల వద్ద 10 నుండి 20 క్వింటాళ్ల వరకు కోత వేయడం అన్యాయమని వాపోయారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టాలని, అమ్మిన ధాన్యానికి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యుడు కొండ వెంకన్న. జాన్ రెడ్డి. సంపత్ రెడ్డి. ప్రవర్ధన్ రెడ్డి. జీవను. నరసింహ. సైదులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Translate »