
మిర్యాలగూడలో కొత్త డ్రామా మొదలైంది. గోవా వెళ్లాల్సిన పనిలేదు.!క్యాసినో స్టైల్ పేకాట ఇక ఇక్కడే అంటూ BRS యువ కౌన్సిలర్ సీక్రెట్ స్కీమ్ పెట్టేశాడట…జిల్లాలో ఎండలు బాగా దంచి పడుతుంటే.. లోపల AC రూముల్లో పేకాట సెంటర్లు కూల్ సమ్మర్ కూల్ అనేలా గోవా లాంటి కేసినో ఏర్పాటు చేశాడు ఆ ప్రతినిధి! ప్రతి రోజు లక్షలు కాసులు తిప్పుతూ, సుమారు 2 లక్షల వరకు కట్ తీసుకుంటూ ఈ పేకాట స్థావరాలు నడిపిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి…ఖరీదైన మందు, ఫుల్ ఎంటర్టైన్‌మెంట్, గోవా క్యాసినో స్టైల్ సెటప్‌తో యువతను ఆకర్షిస్తూ డబ్బులు దోచుకుంటున్నారని స్థానికులు అంటున్నారు….నిన్న హనుమాన్ పేటలో ఈ పేకాట అడ్డాపై ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆదేశాలతో డిఎస్పి రాజశేఖర్ రాజు టూ టౌన్ పోలీసులు సడన్ రైడ్ చేయడంతో అసలు కథ బయటపడింది…రైడ్ జరుగుతుందనే సమాచారం అందుకున్న వెంటనే కౌన్సిలర్ పరార్ అయ్యాడట… అయితే తరువాత టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం….ఈ వ్యవహారం చూస్తుంటే… గోవా క్యాసినో కల్చర్‌ను మిర్యాలగూడకి దిగుమతి చేసినట్టే ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…పేకాటతో కుటుంబాలు రోడ్డున పడుతున్నా,నాయకులే ఇలా వ్యవహరిస్తే ఎలా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి…అయినా ప్రతినిధులది తప్పు కాదు ఓటు వేసిన జనాలదే! నమ్మి ఓటేశారు గా అందుకే పేకాటతో కుటుంబాలను రోడ్లకు ఈడుస్తున్నాడు..చట్టం తన పని తానుకు చేసుకోపోతున్నట్టుగా తూ..తూ.. మంత్రంగానే కేసులు దర్యాప్తులు అవుతాయి…ప్రతినిధి కనుక ఇన్ఫ్యూలెన్స్ వాడుతాడు.. బయటపడతాడు..అన్నట్టు మర్చితిని ప్రతినిధిగా ఎన్నికయ్యాక తన దందాలే వేరట! ఈమధ్య 8 ల్యాండ్ సెటిల్మెంట్లు చేశాడంట గురుడు..ఆ ప్రతినిధి భయానికి బాధితులు ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడుతున్నట్టు సమాచారం…
