RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

కాంగ్రెస్ నూతన అధ్యక్షులకు ఘన సన్మానం

  • మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో వేడుక
  • పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ నాయకులు

నల్గొండ నియోజకవర్గం, జూలై 2 (డిగ్నిటి న్యూస్): నల్గొండ నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను శుక్రవారం నల్గొండలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. బాధ్యతలు స్వీకరించిన నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గంగుల సైదులు, కనగల్ మండల అధ్యక్షుడు గడ్డం అనుప రెడ్డి, తిప్పర్తి మండల అధ్యక్షుడు పాదూరి శ్రీనివాస్ రెడ్డిలకు నాయకులు శాలువాలు కప్పి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సన్మాన మహోత్సవంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ జెడ్పీటీసీలు గుమ్ముల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బుకొని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ పాల్గొన్నారు. అలాగే కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, ఆర్టీఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డిలతో పాటు పలువురు స్థానిక కార్పొరేటర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

Gundeboina Venkanna Yadav
Gundeboina Venkanna Yadav
Sub Editor
Nalgonda Dist.
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully