RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

నల్గొండలో రాపోలు ఆస్పత్రి ప్రారంభం

ఘనంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండ నియోజకవర్గం, జూన్ 24 (డిగ్నిటి న్యూస్): నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రాపోలు హాస్పిటల్‌ను బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆస్పత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలను పరిశీలించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

స్థానిక ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్‌లతో పాటు పలువురు స్థానిక నాయకులు, వైద్యులు మరియు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Gundeboina Venkanna Yadav
Gundeboina Venkanna Yadav
Sub Editor
Nalgonda Dist.
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully