RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ ఆర్టీసీ సంస్థకు అప్పజెపాలి జేఏసీ నాయకులు…

ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ ఆర్టీసీ సంస్థకు అప్పజెపాలి జేఏసీ నాయకులు…

ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సంస్థకు అప్పజెప్పాలని ఆళ్లగడ్డ డిపో ఉద్యోగ సంఘ JAC కార్మిక సంఘ నాయకులు ఎన్ఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్, సలాం, డిమాండ్ చేశారు. మంగళవారం ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో ఆవరణం నందు కార్మిక సంఘాలు, జేఏసీ నాయకులు,పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.ఎం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొని వచ్చి పినాకిల్ అనే సంస్థకు అప్పగించడం జరిగిందన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు ఎంతో నైపుణ్యం కలవాలని ఎలక్ట్రికల్ బస్సులను సంస్థ లో పనిచేసే డ్రైవర్లకే అప్పగించాలని లేకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని సంగం నాయకుడు రాజశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డిపో ప్రెసిడెంట్ ట్రెజరర్ నాగయ్య సెక్రటరీ ఎం రాజారావు, రీజినల్ ఉపాధ్యక్షుడు కేఎం స్వామి సుభాన్ ఎస్ఎస్ వలి డిపో సెక్రటరీ రోశయ్య ప్రెసిడెంట్ రమేష్ ప్రెసిడెంట్ గిరిబాబు కె.వి.రమణ జనార్ధన్ కార్మికులు సంఘ నాయకులు పాల్గొన్నారు.

Madam Yashwanth
Madam Yashwanth
Sub Editor
Nandyal
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully