హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొల్లు బాలకృష్ణ

నాంపల్లిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక: పలువురి అభినందనలు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 11 (డిగ్నిటీ న్యూస్): తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నల్లగొండ జిల్లాకు చెందిన కొల్లు బాలకృష్ణ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని టీఎన్జీవోస్ యూనియన్ సెంట్రల్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన రాష్ట్ర వసతి గృహ సంక్షేమ అధికారుల సర్వసభ్య సమావేశంలో ఈ ఎంపిక జరిగింది.

టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. బాలకృష్ణ ప్రస్తుతం నల్లగొండ జిల్లా పెద్దవూర గిరిజన ప్రభుత్వ సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్, కోశాధికారి బి. లక్ష్మణ్‌లతో పాటు టీఎన్జీవోస్‌ నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ళ మురళి, జే. శేఖర్ రెడ్డి, జిల్లా వార్డెన్ల సంఘం అధ్యక్షుడు భీమగాని రణధీవే, సెక్రటరీ సత్యనారాయణ తదితరులు బాలకృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *