నంద్యాలలో కేక్ కట్ చేసిన టీడీపీ శ్రేణులు

నంద్యాల, జూన్ 10 (డిగ్నిటి న్యూస్): నంద్యాల నియోజకవర్గంలో హిందూపురం శాసనసభ్యుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి. ఫిరోజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ బాలకృష్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు ఖలీల్, శ్యామ్ సుందర్ లాల్, గోవింద్ నాయుడు, తాటికొండ బుగ్గరాముడు, పట్టణ మహిళా అధ్యక్షురాలు విజయ గౌరి తదితరులు పాల్గొన్నారు.


Chirraboina Rama Rao Yadav,
Dignity News Cheaf Editor,
AP/Telangana
