ప్రజాసేవకే ఈ షాపులు అంకితం: సీనియర్ పాత్రికేయులు నూర్ బాషా
నంద్యాల, జూన్ 9 (డిగ్నిటి న్యూస్): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు (ఏఎంసీ)లో మంగళవారం నిర్వహించిన దుకాణాల లీజు బహిరంగ వేలంలో ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త గోళ్ళ రాజేష్ మూడు దుకాణాలను దక్కించుకున్నారు. యార్డులో మొత్తం 10 షాపులకు వేలం నిర్వహించగా.. అందులో షాప్ నంబర్ 5, 6, మరియు 8లను గొల్ల రాజేష్ తరపున ప్రతినిధులు పాడుకున్నారు. ఈ సందర్భంగా గోళ్ళ రాజేష్ ప్రతినిధి, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు నూర్ బాషా మీడియాతో మాట్లాడారు.గడిచిన ఐదేళ్లుగా గోళ్ళ రాజేష్ నంద్యాల నియోజకవర్గవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారని నూర్ బాషా కొనియాడారు. ప్రస్తుతం మార్కెట్ యార్డు వేలంలో దక్కించుకున్న ఈ మూడు షాపులను కూడా వ్యాపార కోణంలో కాకుండా, ప్రజల సంక్షేమానికి, వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకే ఉపయోగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నంద్యాల ప్రజల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న గోళ్ళ రాజేష్‌కు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, తనకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని నూర్ బాషా పేర్కొన్నారు.


