నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో హోరాహోరీగా షాపుల వేలం

అత్యధికంగా రూ.51 వేలు పలికిన 10వ నంబరు దుకాణం.. పోటీపడ్డ వ్యాపారులు

నంద్యాల, జూన్ 9 (డిగ్నిటి న్యూస్): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలోని దుకాణాలకు సంబంధించి మంగళవారం నిర్వహించిన బహిరంగ వేలం పాటలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. యార్డు అధికారులు పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలంలో వ్యాపారులు భారీ సంఖ్యలో పాల్గొని పోటీపడ్డారు.
ఈ వేలంలో మొదటి షాపును టోకెన్ నంబర్ 64 కలిగిన షేక్ ఇమ్రాన్ బాషా రూ. 32,200 లకు దక్కించుకోగా, రెండో షాపును టోకెన్ నంబర్ 39 తో అజ్మీర్ రూ. 27,000 లకు పాడుకున్నారు. మూడో షాపును టోకెన్ నంబర్ 2 కలిగిన సురేంద్ర రూ. 23,000 లకు, నాలుగో షాపును టోకెన్ నంబర్ 3 తో గుల్లి రూ. 23,800 లకు సొంతం చేసుకున్నారు. అలాగే ఐదో షాపును టోకెన్ నంబర్ 45 కలిగిన చాంద్ బాషా రూ. 27,700 లకు, ఆరో షాపును టోకెన్ నంబర్ 47 తో హర్షి రూ. 37,100 లకు లీజు పొందితే, ఏడో షాపును టోకెన్ నంబర్ 115 తో చాంద్ బాషా రూ. 35,500 లకు దక్కించుకున్నారు.
ఎనిమిదో షాపును టోకెన్ నంబర్ 46 తో నూర్ భాషా రూ. 34,500 లకు, తొమ్మిదో షాపును టోకెన్ నంబర్ 114 కలిగిన సమత్ బాషా రూ. 42,700 లకు సొంతం చేసుకోగా.. ఆఖరిదైన పదో నంబరు షాపునకు అత్యంత భారీ పోటీ నెలకొంది. ఈ దుకాణాన్ని టోకెన్ నంబర్ 27 కలిగిన భూషణ్ రెడ్డి అత్యధికంగా రూ. 51,000 లకు వేలంలో దక్కించుకున్నారు. మార్కెట్ యార్డు నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియ అంతా సజావుగా సాగిందని, వ్యాపారుల నుంచి మంచి స్పందన లభించిందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

గోళ్ళ రాజేష్ ఆధీనంలోకి మూడు మార్కెట్ యార్డు దుకాణాలు

ప్రజాసేవకే ఈ షాపులు అంకితం: సీనియర్ పాత్రికేయులు నూర్ బాషా

నంద్యాల, జూన్ 9 (డిగ్నిటి న్యూస్): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు లో మంగళవారం నిర్వహించిన దుకాణాల బహిరంగ వేలంలో ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త గోళ్ళ రాజేష్ మూడు దుకాణాలను దక్కించుకున్నారు. యార్డులో మొత్తం 10 షాపులకు వేలం నిర్వహించగా.. అందులో షాప్ నంబర్ 5, 6, మరియు 8లను గోళ్ళ రాజేష్ తరపున ప్రతినిధులు పాడుకున్నారు.

ఈ సందర్భంగా గోళ్ళ రాజేష్ ప్రతినిధి, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు నూర్ బాషా మీడియాతో మాట్లాడారు.
గడిచిన మూడేళ్లు పైగా గోళ్ళ రాజేష్ నంద్యాల నియోజకవర్గవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారని నూర్ బాషా కొనియాడారు. ప్రస్తుతం మార్కెట్ యార్డు వేలంలో దక్కించుకున్న ఈ మూడు షాపులను కూడా వ్యాపార కోణంలో కాకుండా, ప్రజల సంక్షేమానికి, వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకే ఉపయోగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

నంద్యాల ప్రజల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న గోళ్ళ రాజేష్‌కు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, తనకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని నూర్ బాషా పేర్కొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *