మృగశిర కార్తి లో ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ ఆర్ శ్రీనివాస్ సూచనలు

మృగశిర కార్తె ప్రారంభంతో వేసవి తీవ్రత తగ్గి, వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు మొదలవుతాయి. ఈ రుతుపవనాల మార్పు సమయంలో బ్యాక్టీరియా, వైరస్లు సులభంగా వ్యాప్తి చెందుతాయి. ఈ కాలంలో సంక్రమణ వ్యాధుల (Infections) నుంచి రక్షణ పొందడానికి మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుర్వేద. వైద్యాధికారి వైద్యాధికారి ఆరోగ్య సూచనల మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆహారపు అలవాట్లు

మాంసాహారులు: (నాన్ వెజిటేరియన్) చేపలను తినడం: మృగశిర కార్తె రోజున చేపలను తినడం ఆనవాయితీగా వస్తోంది. ఇది కేవలం సంప్రదాయమే కాదు, వర్షాకాలంలో వచ్చే శ్వాసకోశ సమస్యలు, ఆస్తమాను నివారించడానికి చేపలు అద్భుతంగా పనిచేస్తాయి. చేపల్లోని పోషకాలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి

శాఖ ఆహారులు( వెజిటేరియన్స్).ఇంగువ – బెల్లం: ఈ కాలంలో ఇంగువ, బెల్లం కలిపి తీసుకోవడం చాలా మంచిది. ఇది శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరచి, వేడిని సమతుల్యం చేస్తుంది.

తాజా ఆహారం: వీలైనంత వరకు వేడిగా, తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి. బయట దొరికే కల్తీ ఆహారాలు, నిల్వ ఉంచిన పదార్థాలను తినడం మానుకోవాలి.

జీవనశైలి & పరిశుభ్రత:నీటిని కాచి తాగాలి: వర్షాకాలం ప్రారంభంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఎల్లప్పుడూ కాచి, చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం శ్రేయస్కరం.

దోమల నివారణ: వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల దోమలు వృద్ధి చెందుతాయి. దోమల కుట్టు ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

శ్వాసకోశ సమస్యల నివారణ: ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ సీజన్ మార్పుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. వారు చలిగాలులకు నేరుగా ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తపడాలి.

వ్యాయామం & దినచర్య:రోజువారీ వ్యాయామం, యోగా ధ్యానము ప్రాణయామము చేయడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని, తేజస్సును పెంచుకోవచ్చు. ఆయుర్వేద పద్ధతుల ప్రకారం క్రమబద్ధమైన నిద్ర మరియు ఆహారపు వేళలు పాటించడం అవసరం.మీ డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *