రాయల్ పీపుల్స్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు అశ్వత్తామ రాయల్ డిమాండ్
పలమనేరు, జూన్ 7 (డిగ్నిటి న్యూస్): ప్రముఖ హైకోర్టు న్యాయవాది, సామాజిక సేవకుడు గంగయ్య నాయుడికి రాజ్యసభ సభ్యత్వం కేటాయించాలని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ (ఆర్‌పీఎఫ్) జిల్లా అధ్యక్షుడు గాంగేయుల అశ్వత్తామ రాయల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బలిజ, కాపు సామాజికవర్గాలు ఎంతో కృషి చేశాయని పేర్కొన్నారు. అయితే, పదవుల కేటాయింపులో ఆయా వర్గాల ప్రముఖులకు సముచిత స్థానం కల్పించకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి బలిజ, కాపులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అందులో భాగంగానే పలమనేరు ప్రాంతానికి చెందిన సీనియర్ న్యాయవాది గంగయ్య నాయుడిని రాజ్యసభకు పంపాలని ఆర్‌పీఎఫ్ తరఫున ఆయన డిమాండ్ చేశారు.

