నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 29 (డిగ్నిటీ న్యూస్): ప్రతినెల చివరి శనివారం మే 30 నాడు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే ప్రత్యేక ప్రజావాణి దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా సంక్షేమ అధికారిని కె.వి కృష్ణ వేణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం మహిళా సంక్షేమ వారోత్సవాలలో భాగంగా దివ్యాంగుల కొరకు , వయోవృద్ధుల కొరకు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఇట్టి అవకాశాన్ని జిల్లాలోని వయోవృద్ధులు దివ్యాంగులు వినియోగించుకోవాలని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రతి నెల చివరి శనివారం దివ్యాంగులకు వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి
