RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

పాశం యాదగిరి వ్యాఖ్యలపై జనసేన నేతల తీవ్ర ఆగ్రహం

బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ రాచమడుగు బ్రదర్స్ డిమాండ్

నంద్యాల, మే 27 (డిగ్నిటి న్యూస్): ఒక ప్రముఖ మీడియా ఛానల్ చర్చా కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన నాయకులు, ‘జనసేన బ్రదర్స్’ రాచమడుగు సుందర్ తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం నాడు మీడియా ముఖంగా వారు పాశం యాదగిరి తీరును తీవ్ర పదజాలంతో ఎండగట్టారు. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన జర్నలిజం వృత్తిలో ఉంటూ, ఒక పార్టీ అధినేతను, ఉపముఖ్యమంత్రిని పట్టుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం అత్యంత హేయమైన చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.చర్చా వేదికలపై రాజకీయ విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ, సంస్కారం మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడటం పాశం యాదగిరి అహంకారానికి నిదర్శనమని రాచమడుగు సుందర్ విమర్శించారు. తెలంగాణ సమాజం ఎప్పుడూ సంస్కారానికి, గౌరవానికి పెద్దపీట వేస్తుందని, కానీ యాదగిరి లాంటి వ్యక్తులు ఆ సంస్కృతికి మచ్చ తెస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో కూడా పలుమార్లు ఆయన ఇలాగే హద్దులు దాటి మాట్లాడారని, కేవలం టీఆర్‌పీ రేటింగులు, వ్యక్తిగత లబ్ధి కోసమే ఇటువంటి నీచమైన రాజకీయ విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కోట్లాది మంది అభిమానులు, కార్యకర్తల గుండెల్లో ఉన్న నాయకుడని, ఆయనపై ఇటువంటి అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.పాశం యాదగిరి తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని, పవన్ కళ్యాణ్‌కు, జనసేన శ్రేణులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ వ్యాప్తంగా జనసేన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను ఎక్కడికక్కడ అడ్డుకుంటారని, తగిన బుద్ధి చెప్తారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మీడియా ఛానళ్లు కూడా ఇటువంటి సంస్కారహీనమైన వ్యక్తులను చర్చలకు పిలిచి సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదని వారు ఈ సందర్భంగా హితవు పలికారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully