బనగానపల్లె, జూన్ 24 (డిగ్నిటి న్యూస్): పవిత్ర మొహర్రం పర్వదినాల వేడుకల్లో భాగంగా 8వ రోజు బుధవారం బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేట ప్రాంతానికి చెందిన ఇమామ్ ఖాసీం స్వామి పీర్ల (సవారీ) ఊరేగింపు వైభవంగా సాగింది.
ఈ ఊరేగింపులో భాగంగా పీర్ల చావడి మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి కుటుంబ సభ్యులు బీసీ ఇందిరా రెడ్డి స్వామివారికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఫతేహాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
