RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
14-10-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

తల్లిపాలపై చైతన్యం

నల్గొండ, ఆగస్టు 4 (డిగ్నిటి న్యూస్): నల్గొండ పట్టణంలోని 48వ డివిజన్‌లో మహిళా అభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో స్థానిక కార్పొరేటర్ యామ కవిత దయాకర్ పాల్గొని ప్రసంగించారు. ప్రతి కుటుంబానికి తల్లిపాల విశిష్టతను తెలియజేయడమే కాకుండా, తల్లి మరియు శిశువు ఆరోగ్య పరిరక్షణపై సమాజంలో విస్తృత చైతన్యం తీసుకురావాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య…

రోడ్డు నిర్మాణానికి మంత్రి హామీ

నల్గొండ, ఆగస్టు 2 (డిగ్నిటి న్యూస్): నల్గొండ మండల పరిధిలోని వెలుగుపల్లి నుంచి అద్దంకి బైపాస్ అనిశెట్టి దుప్పలపల్లి వరకు డాంబర్ రోడ్డు నిర్మించాలని రసూల్ పురం సర్పంచ్ గుండెబోయిన వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్థులు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే రోడ్డు పనులు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలుక సైదిరెడ్డి, జేరిపోతుల శ్రీరామ్, గుండెబోయిన శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు, గుండెబోయిన…

మా జోలికి వస్తే రాజకీయ సమాధి కడతాం!

కోమటిరెడ్డి సోదరులపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన వ్యాఖ్యలు ​సూర్యాపేట/తుంగతుర్తి, జూలై 24 (డిగ్నిటి న్యూస్): ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. నల్గొండ జిల్లా రాజకీయాల్లో ప్రముఖులైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల తీరుపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంపై అనవసర జోక్యం చేసుకుంటూ తమ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని,…

నందవరం చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలకు మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డికి ఆహ్వానం

నందవరం, జూలై 24 (డిగ్నిటీ న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రం నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జూలై 27 నుండి 29 వరకు వైభవంగా జరగనున్న శాకాంబరీ ఉత్సవాలకు రావాల్సిందిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి, ఆయన సతీమణి ఇందిరా రెడ్డిలను ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎన్. శ్రీనివాస రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పి.వి. కుమార్…

పేదల పాలిట శ్రీరామరక్ష ‘గోళ్ళ రాజేష్’..

నంద్యాల, జూలై 24 (డిగ్నిటి న్యూస్):సామాజిక సేవే పరమావధిగా, నిరుపేదలు మరియు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు గోళ్ళ రాజేష్ నంద్యాలలో అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆయన ప్రతినిధి, సీనియర్ పాత్రికేయుడు నూర్ భాష కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు, నిరుపేద యువతీ యువకులు సొంత కాళ్లపై నిలబడి స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా గోళ్ళ రాజేష్ గురువారం తన కార్యాలయంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని…

నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

నంద్యాల, జూలై 21 (డిగ్నిటి న్యూస్): నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎమ్‌డీ రఫీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులు, ఉద్యమకారులపై పోలీసులు నిరంకుశంగా లాఠీచార్జ్ చేయడాన్ని, భాష్పవాయు గోళాలు ప్రయోగించడాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు….

నంద్యాలలో ఘనంగా వైద్య సదస్సు

నంద్యాల, జూలై 19 (డిగ్నిటి న్యూస్): నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో కర్నూలు కామినేని జెమ్ కేర్ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త నిర్వహణలో స్థానిక ఒక హోటల్ సమావేశ భవనంలో నంద్యాల ప్రాంత వైద్యులకు నిరంతర వైద్య విద్యా సదస్సు నిర్వహించారు. ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా…

వ్యక్తిగత దూషణలు మాని ప్రజా సమస్యలపై మాట్లాడాలి

ఎమ్మిగనూరు, జూలై 18 (డిగ్నిటి న్యూస్): రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మాని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత వారం రోజులుగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు వైఎస్ఆర్‌సీపీ నాయకులపై అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.ప్రజలకు చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడకుండా…

Exit mobile version