రాజుపాలెం, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యంపై కనీస అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆర్. శ్రీనివాస్ సూచించారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సోమవారం ప్రాంతీయ ఉపాసంచాలకులు డాక్టర్ పి. జగదీష్ ఆదేశాల మేరకు వైద్య శిబిరం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీడీవో బి. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్,…
గాలివాన అనంతరం పారిశుధ్య పనులు అత్యవసరంగా చేపట్టాలి. మంత్రి, మేయర్ ఆదేశాలు
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 4 (డిగ్నిటీ న్యూస్).నిన్న సంభవించిన గాలివాన ప్రభావంతో నల్గొండ నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడం, ఫ్లెక్సీలు , బ్యానర్లు కూలిపోవడం, డ్రైన్లు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తిన నేపథ్యంలో, నగర పారిశుధ్య పరిస్థితిని సమీక్షించేందుకు మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర సోమవారం ఉదయం 36వ , 37వ డివిజన్లలో పర్యటించారు.ఈ సందర్భంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి , మేయర్…
ఎన్ డి సి ఎం ఎస్ కేంద్రాలలో ధాన్యం ట్రాన్స్పోర్ట్ వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలి: సిపిఎం డిమాండ్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 4 (డిగ్నిటీ న్యూస్). ఎన్ డి సి ఎం ఎస్ కేంద్రాలలో వడ్ల కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్తంగా నెలకొన్నదని, రైతులను పట్టించుకునే పరిస్థితి లేకపోవడం దారుణమని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ విమర్శించారు. రైస్ మిల్లర్ల దోపిడి రోజురోజుకు పెరుగుతోందని, వెంటనే రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం…
పీఏసీఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆలకుంట్ల నాగరత్నం రాజు
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 4. (డిగ్నిటీ న్యూస్).ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నల్లగొండ గొల్లగూడ పి ఎ సి ఎస్ చైర్మన్ గా ఆలకుంట్ల నాగరత్నం రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించినట్లు చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు వెల్లడించారు . ఈ సందర్భంగా నాగరతం రాజు మాట్లాడుతూ గోల్లగూడ పీ ఏ సీ ఎస్ నుండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తూ, రైతులకు సకాలంలో…
నల్గొండలో విషాదం: సాగునీటి శాఖ ఈఈ ఆత్మహత్య
నల్గొండ, మే 04 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నల్గొండ నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) డివిజన్ -6 గంధ వారి గూడెం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సతీష్ చంద్ర యాదవ్ ఆకస్మిక మరణం జిల్లావ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పరిధిలోని చందనపల్లి సమీపంలో గల డి-37 కాల్వలోకి దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం విధులకు వెళ్తున్నట్లుగా బయలుదేరిన ఆయన, చందనపల్లి వద్దకు చేరుకోగానే ఎవరూ లేని సమయం…
నంద్యాల విద్యుత్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభం
నంద్యాల, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నంద్యాల పట్టణంలోని నూనెపల్లె విద్యుత్ కార్యాలయ ఆవరణలో గోళ్ల రాజేష్ ఆధ్వర్యంలో, కౌలు రైతుల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం విద్యుత్ శాఖ డీఈలు శ్రీనివాస్, నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్య ప్రజలకు ఈ ఉచిత…
ఖాకీలపై కారం చల్లి దాడి
చిత్తలూరులో గోడ వివాదం ఉద్రిక్తత.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు శాలిగౌరారం/నల్లగొండ, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రెండు వర్గాల మధ్య నెలకొన్న సామాన్య గోడ వివాదం చివరకు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి దారితీసిన ఘటన శాలిగౌరారం మండలం చిత్తలూరులో కలకలం రేపింది. శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు వెళ్లిన పోలీసుల కళ్లలో కారం చల్లి, రాళ్లతో దాడి చేయడంతో ఒక కానిస్టేబుల్ తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. గ్రామంలోని రెండు వర్గాల మధ్య కొంతకాలంగా గోడ…
అదరగొట్టావు తంబి…
టీవీకే అధినేత విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి ఇచ్చిన తన మొదటి ఇంటర్వ్యూలో తన రోల్ మోడళ్లలో ఎం. జి. రామచంద్రన్, జె. జయలలిత, ఎం. కరుణానిధి వంటివారు ఉన్నారని పేర్కొన్నడటం విశేషం.. విజయ్ పార్టీని ప్రకటించినప్పుడు అందరూ నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వులే ఇప్పుడు నోళ్లు నొక్కుకొనేలా చేశాడు జోసెఫ్ విజయ్….జోసెఫ్ విజయ్ ప్రధానంగా యువత, మహిళల ఓటు బ్యాంకును రాబట్టడంలో సక్సెస్ అయ్యారు.. తమిళనాడులో ఉన్న లక్షలాది మంది…
Dignity News Pdf 04.05.2026
అరాచకంపై అక్షరాయుధాల గర్జన..అనంతపురంలో మీడియా పవర్..!
నంద్యాల, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): అనంతపురంలో జర్నలిస్టుపై సాగిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ పాత్రికేయ లోకం కదం తొక్కింది. గీతం జూనియర్ కళాశాల చైర్మన్ మనీషా నాయర్ సాగించిన అరాచకానికి వ్యతిరేకంగా జిల్లాలోని విలేకరులందరూ యూనియన్లకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి తమ సత్తా చాటారు. ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చిన ఆమెను, ఆమె అనుచరులను విలేకరులు ఐకమత్యంతో నిలదీసి అక్కడి నుంచి తరిమికొట్టిన తీరు మీడియా శక్తికి నిదర్శనంగా నిలిచింది. ఒక విలేకరి వ్యక్తిగత స్వేచ్ఛను…
