RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

చండ్రాజుపాలెం తిరునాళ్లలో ఆయుష్ వైద్య శిబిరం

బెల్లంకొండ (చండ్రాజుపాలెం), మే 9 (డిగ్నిటి న్యూస్): పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుష్ వైద్య శిబిరానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రాంతీయ ఉపసంచాలకులు డాక్టర్ పి. జగదీష్ ఆదేశాల మేరకు డాక్టర్ ఆర్. శ్రీనివాస్, డాక్టర్ కాంచన, డాక్టర్ స్వర్ణలత ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన…

నల్లబెల్లిలో ఓంకార్ శతజయంతి సభ పోస్టర్ల ఆవిష్కరణ

నల్లబెల్లి, మే 9 (డిగ్నిటి న్యూస్): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ‘అసెంబ్లీ టైగర్’ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి ఉత్సవాల ముగింపు సభను విజయవంతం చేయాలని ఎంసీపీఐ(యు) మండల కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలో సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి దామ సాంబయ్య, సహాయ కార్యదర్శి మార్తా నాగరాజు మాట్లాడుతూ వచ్చే మంగళవారం (మే 12న) సాయంత్రం…

అమ్మ: అనంత ప్రేమకు అక్షర నీరాజనం

మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు మాతృ దినోత్సవ సందర్భంగా డిగ్నిటి న్యూస్ ప్రతినిధి జి అజయ్ కుమార్ అందిస్తున్న ప్రత్యేక కథనం అమ్మ…రెండక్షరాల అద్భుతం. ఈ చిన్న పదంలోనే అనంతమైన విశ్వం ఇమిడి ఉంది. మనం తొలిసారి శ్వాస తీసుకున్న క్షణం నుండి, మన జీవితాన్ని అర్థవంతమైన ప్రయాణంగా మలిచే శాశ్వత నిధి అమ్మ. సృష్టిలో వెలకట్టలేనిది, వెతికినా దొరకనిది కేవలం తల్లి ప్రేమ మాత్రమే. మనం ఈ భూమిపై అడుగుపెట్టక ముందే, తన రక్తమాంసాలను పంచి మనకు…

బుడగ జంగాల చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం

బుడగ జంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు నంద్యాల, మే 9: బుడగ జంగాల చిరకాల వాంఛను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని బేడా బుడగ జంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు కొనియాడారు. నంద్యాలలోని 38వ వార్డు వైఎస్సార్ నగర్ టీడీపీ ఇంచార్జి హోదాలో ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బుడగ జంగాలకు ఎస్సీ పథకాలను వర్తింపజేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, ఇది…

జనగణన పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రచార రథం

జనగణన సందర్భంగా పూర్తి సమాచారం ఇచ్చి సహకరించండి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విజ్ఞప్తి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 9 (డిగ్నిటీ న్యూస్): జనగణనకు ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. జనగణన అన్ని రకాల అభివృద్ధికి ముఖ్యమని, జనగణలో ప్రతి కుటుంబం వారి వివరాలను తెలియజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జనగణన పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రచార…

యాసంగి ధాన్యం కొనుగోళ్ళడం వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 9 (డిగ్నిటీ న్యూస్): యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ అన్నారు. దేవరకొండ నియోజక వర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు పూర్తి చేయాలని చెప్పారు. శనివారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్,. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తో కలిసి డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లాలో ఇప్పటివరకు 457 కొనుగోలు కేంద్రాల…

నిరుద్యోగ యువతకు ‘నాక్’ ఓ వరం

నల్గొండ, మే 9 (డిగ్నిటి న్యూస్): జిల్లాలోని నిరుద్యోగ యువత జాతీయ నిర్మాణ అకాడమీ (నాక్) అందిస్తున్న ఉచిత శిక్షణను అందిపుచ్చుకుని ఉపాధి రంగంలో రాణించాలని సీటీటీఐ డైరెక్టర్ ఎం. రాజిరెడ్డి సూచించారు. నల్గొండలోని నాక్ కేంద్రాన్ని శుక్రవారం ఆయనతో పాటు గోన రెడ్డి, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్, శశిపితం సహా పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో కొనసాగుతున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న…

నల్గొండ జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

నల్గొండ, మే 9 (డిగ్నిటి న్యూస్): కేతేపల్లి మండల పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం కొర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో H 38 F 3447 నంబర్ గల లారీని అనుమానంతో ఆపి పరిశీలించగా, అందులో భారీ మొత్తంలో గంజాయి బయటపడింది. ఈ ఘటనపై కేతేపల్లి ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాన్ని సీజ్ చేసి, కేసు…

బుడగజంగాల సంక్షేమానికి సీఎం పెద్దపీట: తాటికొండ బుగ్గ రాముడు హర్షం

నంద్యాల, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రాష్ట్రంలోని బుడగజంగాల సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల బేడ బుడగ జంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గ రాముడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బుడగజంగాలను ఎస్సీల్లో చేర్చే విషయంపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇవ్వడమే కాకుండా, కేంద్రం ఆమోదం వచ్చేలోపే ఉద్యోగ నియామకాలు మినహా…

ఎండల వేళ అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో యాకూబ్ నాయక్

నల్గొండ బ్యూరో, మే 8 (డిగ్నిటి న్యూస్): నల్గొండ మండల పరిధిలోని రసూల్ పూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలకు దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీల సౌకర్యార్థం వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) యాకూబ్ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవి దృష్ట్యా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, కూలీలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని…

Exit mobile version