ఈ నెల 17న సీఎం రేవంత్రెడ్డి నల్లగొండ పర్యటన: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 11 (డిగ్నిటీ న్యూస్): నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామ సమీపంలో రూ.450 కోట్లతో కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ కాల్వ లైనింగ్ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను…
ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం
శాంతిరామ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పరీక్షలు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి: ఆర్గనైజర్ ఉరుకుందప్ప నంద్యాల, జూన్ 11 (డిగ్నిటి న్యూస్): స్థానిక తెలుగు గంగా కార్యాలయంలో శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తెలుగు గంగా కార్యాలయ సూపర్డెంట్ డి. ప్రసాదరావు సహకారంతో ఈహెచ్ఎస్ (EHS) ద్వారా ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ…
మైనార్టీల విద్య, రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
నల్గొండలో ఉర్దూ పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 10 (డిగ్నిటి న్యూస్): ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్కలో రూ.44 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ…
ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు
నంద్యాలలో కేక్ కట్ చేసిన టీడీపీ శ్రేణులు నంద్యాల, జూన్ 10 (డిగ్నిటి న్యూస్): నంద్యాల నియోజకవర్గంలో హిందూపురం శాసనసభ్యుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి. ఫిరోజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ బాలకృష్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని…
నల్లగొండ అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 10 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి బుధవారం ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి, ప్రస్తుత ధాన్యం సేకరణ తదితర కీలక అంశాలపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు….
వేగం కాదు.. ప్రాణాలతో చేరడమే ముఖ్యం
వెలిమినేడు గ్రామ సభలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన డీజీపీ, ఎస్పీ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 10 (డిగ్నిటి న్యూస్): ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చిట్యాల మండలం వెలిమినేడులో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన టెక్నికల్ సర్వీసెస్ డీజీపీ వి.వి. శ్రీనివాస్ రావు, జిల్లా ఎస్పీ…
ముగిసిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ వార్డు సభలు
నగరాభివృద్ధికి ప్రజల సూచనలే మార్గదర్శకం: మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 10 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” ప్రత్యేక వార్డు సభల కార్యక్రమం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విజయవంతంగా ముగిసింది. మొత్తం నాలుగు విడతలుగా సాగిన ఈ సభలలో భాగంగా.. చివరి రోజు 11, 31, 32, 33, 34, 35, 36, 37, 41, 43,…
గోళ్ళ రాజేష్ ఆధీనంలోకి మూడు మార్కెట్ యార్డు దుకాణాలు
ప్రజాసేవకే ఈ షాపులు అంకితం: సీనియర్ పాత్రికేయులు నూర్ బాషా నంద్యాల, జూన్ 9 (డిగ్నిటి న్యూస్): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు (ఏఎంసీ)లో మంగళవారం నిర్వహించిన దుకాణాల లీజు బహిరంగ వేలంలో ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త గోళ్ళ రాజేష్ మూడు దుకాణాలను దక్కించుకున్నారు. యార్డులో మొత్తం 10 షాపులకు వేలం నిర్వహించగా.. అందులో షాప్ నంబర్ 5, 6, మరియు 8లను గొల్ల రాజేష్ తరపున ప్రతినిధులు పాడుకున్నారు. ఈ సందర్భంగా గోళ్ళ రాజేష్…
నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో హోరాహోరీగా షాపుల వేలం
అత్యధికంగా రూ.51 వేలు పలికిన 10వ నంబరు దుకాణం.. పోటీపడ్డ వ్యాపారులు నంద్యాల, జూన్ 9 (డిగ్నిటి న్యూస్): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలోని దుకాణాలకు సంబంధించి మంగళవారం నిర్వహించిన బహిరంగ వేలం పాటలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. యార్డు అధికారులు పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలంలో వ్యాపారులు భారీ సంఖ్యలో పాల్గొని పోటీపడ్డారు.ఈ వేలంలో మొదటి షాపును టోకెన్ నంబర్ 64 కలిగిన షేక్ ఇమ్రాన్ బాషా రూ. 32,200 లకు దక్కించుకోగా, రెండో…
కార్పొరేట్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి
కర్నూలు, జూన్ 8 (డిగ్నిటి న్యూస్): ఐఐటీ, జేఈఈ మెయిన్స్, నీట్ పుస్తకాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారానికి పాల్పడుతున్న కార్పొరేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఆయన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా…
