నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు శనివారం చర్లపల్లి ప్రాంతంలోని సంచార బస్తీలో “సురక్షిత్ బచ్పన్ – సురక్షిత్ భవిష్య” కార్యక్రమంలో భాగంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, మహిళలు మరియు పిల్లల రక్షణకు సంబంధించిన వివిధ చట్టాలపై స్థానిక ప్రజలకు సమగ్రంగా అవగాహన కల్పించారు. సమాజంలో ప్రతి…
భూముల మార్కెట్ విలువల సవరణ పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్
నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ శనివారం కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను బట్టి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సవరణలు ఉంటాయని కలెక్టర్…
నైపుణ్యాభివృద్ధి శిక్షణలతోనే యువతకు ఉపాధి- జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్లగొండ, మే 23 (డిగ్నిటీ న్యూస్): యువత స్వయంశక్తితో సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన యువజన వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కప్ క్రీడలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు, జాబ్ మేళాలో…
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు శనివారం స్థానిక మారుతి సుజుకి పవన్ మోటార్స్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి, సీసీఓ రవిరెడ్డి, జీఎం నాగమణి సుధాకర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్ర పవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి…
బోడ స్వామికి రెండోసారి కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా పగ్గాలు
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్‌గా బోడ స్వామి రెండోసారి నియమితులయ్యారు. ఈ నియామకం నేపథ్యంలో ఆయన శనివారం నల్లగొండలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండోసారి జిల్లా పగ్గాలు చేపట్టిన బోడ స్వామిని ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పట్టణ…
తుంగభద్ర నది నుండి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి
*ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* కర్నూలు, మే 23:- తుంగభద్ర నది నుండి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా అరికట్టే అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా చేసే వారి పట్ల కఠినంగా…
మంత్రి కోమటిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
మంత్రికి బోకే అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి. నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 23. (డిగ్నిటి న్యూస్) రాష్ట్ర రోడ్డు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి గారిని కలిసి బోకే అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ…
ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం నల్లగొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల సమక్షంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్…
యాదగిరిగుట్టలో రూ. 99.55 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శనివారం ఘనంగా శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కాంచీ కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో, వేదమంత్రోచ్ఛారణల మధ్య తొలుత వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు….
సంజామలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం
సంజామల, మే 22 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్జా సంజామల మండలంలోని ముక్కమల్ల, ఆకుమల్ల, ఆల్వకొండ గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో గ్రామాల్లో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షానికి ఆరబోసిన మిరప, వరి ధాన్యం తడిసిపోవడంతో పాటు పలుచోట్ల ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం…
