RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

మార్కెట్ యార్డు దుకాణాల వేలం పూర్తి

రెండో విడతలో నాలుగు దుకాణాలు దక్కించుకున్న గోళ్ళ రాజేష్

– అధికారుల తీరుపై వేలందారుల అసహనం; ఒకానొక దశలో వాగ్వివాదం

మార్కెట్ కమిటీకి రికార్డు స్థాయి ఆదాయం: చైర్మన్ గుంటుపల్లి హరిబాబు

జర్నలిస్టుల పెన్షన్‌కు అంగీకరించిన దాతృత్వానికి గుర్తింపు.. వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్‌కు ఘన సన్మానం

https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002210781.mp4

నంద్యాల, జూన్ 20 (డిగ్నిటి న్యూస్): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం దుకాణాల (షాపుల) లీజుకు సంబంధించి రెండో విడత బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. గతంలో జరిగిన మొదటి విడత వేలంలో మూడు రూములను దక్కించుకున్న ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త గోళ్ళ రాజేష్.. శనివారం జరిగిన రెండో విడత ప్రక్రియలోనూ మరో నాలుగు దుకాణాలను దక్కించుకున్నారు. ఈ వేలం పాట సరళిని గోళ్ళ రాజేష్ స్వయంగా పరిశీలించగా, సీనియర్ పాత్రికేయులు నూర్ బాషా వేలంలో పాల్గొని దుకాణాలను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నూర్ బాషా మాట్లాడుతూ.. ఈ దుకాణాలను కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు, నిరుపేదలకు అన్ని విధాలా మెరుగైన సేవలు అందించేందుకే గోళ్ళ రాజేష్ లీజుకు తీసుకున్నారని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ రూముల ద్వారా మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

నిమిషానికో నిబంధన.. వేలంలో గందరగోళం!

https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002213911.mp4

మార్కెట్ యార్డు దుకాణాల వేలం ప్రక్రియలో అధికారులు తీరుపై వేలందారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు నిమిషానికో రూల్ మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడంతో వేలం పాటదారుల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. 13వ నంబర్ దుకాణానికి ఒకసారి వేలం ప్రక్రియ పూర్తయినప్పటికీ, వేలందారుల మధ్య వాగ్దివాదం జరగడంతో అధికారులు స్పందించి ఆ దుకాణానికి తిరిగి మొదటి నుండి వేలం నిర్వహించాల్సి వచ్చింది. ఈ వేలం పాటలలో 11వ నంబర్ దుకాణం రూ. 30,000, 12వ నంబర్ దుకాణం రూ. 30,000 చొప్పున పలికాయి. అలాగే 13వ నంబర్ దుకాణాన్ని రూ. 14,500 కు శ్రీనివాసులు, 14వ నంబర్ దుకాణాన్ని రూ. 19,500 కు చాంద్ బాషా, 15వ నంబర్ దుకాణాన్ని రూ. 25,500 కు అన్వర్ హుస్సేన్ దక్కించుకున్నారు. వీటితో పాటు 16వ నంబర్ దుకాణం రూ. 27,000 కు అరుణ్, 17వ నంబర్ దుకాణం రూ. 30,500 కు అర్షి, మరియు 18వ నంబర్ దుకాణాన్ని రూ. 26,000 కు నూర్ బాషా దక్కించుకున్నారు.

ఈరోజు రెండో విడతలో భాగంగా 14, 15, 17, 18 నంబర్ల పరిధిలోని నాలుగు దుకాణాలను గోళ్ళ రాజేష్ దక్కించుకోగా, దానికి సంబంధించిన ఒక నెల అడ్వాన్స్ నగదును కూడా మార్కెట్ కమిటీ అధికారులకు చెల్లించి రశీదులు పొందడం జరిగింది.

మార్కెట్ యార్డుకు రికార్డు స్థాయి ఆదాయం: చైర్మన్ హరిబాబు

https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002210112.mp4

వేలం ప్రక్రియ ముగిసిన అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మీడియాతో మాట్లాడారు. నంద్యాల పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం వల్ల మార్కెట్ కమిటీకి ఈ వేలం ద్వారా రికార్డు స్థాయిలో రూ. 2,91,700 ఆదాయం సమకూరిందని ఆయన వెల్లడించారు. గతంలో నంది రైతు సమాఖ్య కేవలం రూ. 27,500 మాత్రమే చెల్లించేవారని, ప్రస్తుత వేలం ద్వారా మార్కెట్ యార్డుకు అదనంగా రూ. 2,64,200 ఆదాయం పెరిగిందని హరిబాబు వివరించారు. ఈ వేలం వివరాలన్నింటినీ త్వరలోనే కోర్టుకు సమర్పిస్తామని, కోర్టు ఆదేశాల ప్రకారం అత్యంత త్వరలోనే దుకాణాలను వేలం పాడుకున్న లబ్ధిదారులకు అప్పగిస్తామని (హ్యాండోవర్) చైర్మన్ స్పష్టం చేశారు.

దాతృత్వానికి గుర్తింపు: వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్‌కు ఘన సన్మానం

https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002207133.mp4

నిరుపేద, కరస్పాండెంట్ పాత్రికేయుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. ప్రభుత్వం నుండి ఎలాంటి ఆసరా లేని సమయంలో జర్నలిస్టుల కష్టాలను గుర్తించి, వారికి నిలకడైన సాయం అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ నూర్ బాషా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జర్నలిస్టుల కష్టాలు తెలిసిన నూర్ బాషా.. వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ తో మాట్లాడి, వారి పరిస్థితిని వివరించి, పెన్షన్ ఇచ్చేలా ఒప్పించారు. నూర్ బాషా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, పాత్రికేయులకు ప్రతి రెండు నెలలకు ఒకసారి రూ. 3,000 చొప్పున ఆర్థిక సహాయం (పింఛన్) అందిస్తున్న గోళ్ళ రాజేష్ దాతృత్వానికి కృతజ్ఞతగా స్థానిక జర్నలిస్టులు ఆయనకు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002210899.mp4

సీనియర్ జర్నలిస్ట్ సీఎం నాగేంద్ర ఆధ్వర్యంలో వ్యాపారవేత్త, పేదల పెన్నిధి గోళ్ళ రాజేష్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ.. తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని, పెన్షన్ రూపంలో నిరంతరం అండగా నిలుస్తున్న గోళ్ళ రాజేష్ కి, అందుకు చొరవ చూపిన నూర్ బాషా కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కొనియాడారు. వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు హనుమంతు, రఫీ, నిరంజన్, రామన్న, ఉస్మాన్ భాష, మజీద్, శ్రీనివాస్, శివరాం, నరసింహమూర్తి, దస్తగిరి, కటారి తదితరులు పాల్గొన్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version