RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

నకిరేకల్ లో జరిగే జర్నలిస్టుల జిల్లా మహాసభను జయప్రదం చేయండి

జిల్లా మహాసభలకు హాజరుకానున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం

సభాస్థలిని పరిశీలించిన యూనియన్ నాయకులు

జిల్లా వ్యాప్తంగా తరలిరానున్న 300 మంది జర్నలిస్టులు

టీయూడబ్ల్యూజే(ఐజేయు) నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులు చెరుకు సతీష్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి , మే 28 . (డిగ్నిటీ న్యూస్). జూన్ 3 వ తేదీన నకిరేకల్ పట్టణంలోని వినాయక బంకెట్ హాల్ లో జరిగే టి యు డబ్ల్యూ జే ( ఐజేయు ) జిల్లా మహాసభను జయప్రదం చేయాలని సంఘం నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకు సతీష్ తెలిపారు. బుధవారం ఉదయం నకిరేకల్ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహాసభకు నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం , ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి , టి యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామ నారాయణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ. ప్రభాకర్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. మహాసభకు జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు తరలిరావాలని పిలుపునిచ్చారు.నల్లగొండ జిల్లాలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ కు ప్రింట్,ఎలక్ట్రాన్ మీడియా, చిన్న పత్రికలు, ఫోటో జర్నలిస్టులు,వీడియో జర్నలిస్టుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందన్నారు.జిల్లాలోని ప్రతి జర్నలిస్టు హక్కుల కోసం టీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులను అందిస్తామని ఇందుకోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు రేపాల సతీష్ గౌరవ సలహాదారు కందగట్ల శ్రీధర్ హెచ్ఎంటీవీ స్టాప్ రిపోర్టర్ పరమేష్, శ్రీనివాసరెడ్డి కోశాధికారి రాములు రవీంద్ర చారి మోహన్ బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Chintha Yadaiah
Reporter
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version