RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

వైభవంగా చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల ఉత్సవం

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు

ఆకుమల్ల పెద్దమ్మ జాతరలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

సంజామల, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): మండలంలోని ఆకుమల్ల గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల కార్యక్రమాన్ని భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని తళారీ జక్కులు నివాసం వద్ద నుంచి ప్రారంభమైన ఈ జ్యోతుల ప్రదర్శన మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా సాగింది. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్ర అనంతరం జ్యోతులు చౌడేశ్వరి దేవి ఆలయానికి చేరుకున్నాయి. అక్కడ అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా ఖడ్గమాల పఠించి, శాస్త్రోక్తంగా విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ వేడుకను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తిభావం వెల్లివిరియగా, భక్తులు లైన్లలో వేచి ఉండి అమ్మవారికి బియ్యం, బేడలు, కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version